Monday, October 10, 2022

ప్రధానమైన ఆజ్ఞ జనవరి 7



మార్కు 12:30 - "నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ

వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను.”

బైబిలులోని ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఒకరోజు శాస్త్రి ఒకడు యేసును అడిగెను.

వెంటనే యేసు ఇచ్చిన జవాబు, లేఖనాధారమైనది కాబట్టి సంపూర్ణమైనది.

సారాంశపూర్వకంగా, ప్రధానమైన ఆజ్ఞ. "దేవుని ప్రేమించవలెను!” అన్నది అని చెప్పాడు.

ఎలా మనం దేవుని ప్రేమించగలం?

ఉద్వేగపూర్వకంగా దేవుని ప్రేమించాలి. "నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ

పూర్ణాత్మతోను... నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను.” “హృదయము”, “ఆత్మ” అనే

పదాలు దేవున్ని ఉద్వేగాలతో ప్రేమించాలని మనకు చూపిస్తాయి. దేవుడు ఒక వ్యక్తి. ఒక

అరూపభావన కాదు. ఆయన మనతో ఉద్వేగపరమైన అన్యోన్యతను పంచుకొనుటకు

ఇష్టపడుతున్నాడు. ఆవేశంతో కూడిన ఉద్వేగాలకు గురికాకుండా చేసినప్పుడే ఇలాగు

జరుగుతుంది.

వివేకముతో దేవుని ప్రేమించాలి. “నీ పూర్ణ వివేకముతోను.. నీ దేవుడైన ప్రభువును

ప్రేమింపవలెను.” దేవుని ప్రేమించుటలో నీ ఆలోచనలు కూడా ఇమిడి ఉంటాయి. మన

మనస్సులు నూతనపరచబడాలని యేసు కోరుతున్నాడు (రోమా 12:2). మన ఆలోచనలు

ఆయనకు విధేయత చూపేలా చెరపట్టాలి (2 కొరింథీ. 10:5). ఆయన తన వివేకంతో

మనకు బోధిస్తుండగా శ్రేష్టమైన వాటినే మనం ఆలోచించాలి (ఫిలిప్పీ. 4:8).

క్రియల ద్వారా దేవుని ప్రేమించాలి. “...నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవా

ప్రేమింపవలెను.” ఆచరణలో విధేయత చూపుతూ దేవుని ప్రేమించాలి. ప్రేమ మనం చేసే

క్రియ! మనం ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా మన

ప్రేమను నిరూపిస్తాం (యోహాను 14:15). క్రీస్తును పోలి నడుచుకొనుట ద్వారా ఆయనపట్ల

మన ప్రేమను ప్రదర్శిస్తాం (1 యోహాను 3:18) క్రియలు లేని విశ్వాసము మృతము

(యాకోబు 2:17). విధేయతతో కూడిన క్రియలద్వారా దేవునిపట్ల మన ప్రేమను నిరూపిస్తాం.

దేవుని ప్రేమించుటే ప్రధానమైన ఆజ్ఞ. మనం పాల్గొనే ఏ మతపరమైన ఆచారాల

కంటే కూడా అన్యోన్యంగా ఆయనతో సహవాసం చేయుటే అతి ప్రాముఖ్యమైన విషయం.

నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నీ కొరకైన ఆయన అమోఘమైన ప్రేమను

హత్తుకున్నావా? నేడు దేవుని ప్రధానమైన ఆజ్ఞకు విధేయత చూపుము. నీ పూర్ణ

హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుము.


యేసు నామంలో ప్రార్థించుట జనవరి 6



యోహాను 14: 13, 14

"మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి

కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి

అడిగినను, నేను చేతును.”

నేను క్రైస్తవుడనైన వెంటనే, వివిధ స్థలాలలో నేను, నా స్నేహితుడు కలిసి పాటలు

పాడుచు దేవుని వాక్యాన్ని పంచుకోవడం ఆరంభించాం. మాకు మైక్ కావాలని గుర్తించి

రెండు వేల డాలర్లు అప్పు ఇమ్మని అడుగుటకు బ్యాంక్కు వెళ్ళాం. అప్పు ఇచ్చే అధికారి

ఋణము తీర్చుతామని అభయమిచ్చుటకు జామీను మీ దగ్గర ఏమైనా

ఉందా? మా ఇద్దరి దగ్గర ఏమి లేదు. అప్పు తీర్చుతామన్న వాగ్ధానం తప్ప ఇంకేమి

చేయలేక పోయాం. మీరు ఊహించిన విధంగానే, ఎలాంటి అభయం (గ్యారంటీ లేకుండా

మీ నోటి మాటల మీద బ్యాంకు ఋణము ఇవ్వదు.

ఇలా అడిగాడు

మేము నిరాశతో బయటికి వస్తుండగా, ఆ ఋణాన్నిచ్చే అధికారి ఒక్క మాట

అన్నాడు, దానిని నేనెప్పుడు మరచిపోలేదు. “మీ తల్లిదండ్రులకు ఈ బ్యాంకులో అనేక

ఖాతాలు ఉన్నాయి. వారు గ్యారంటీ ఇస్తే మీకు లోను ఇస్తాము.” నేను నేరుగా ఇంటికెళ్లి,

మా తల్లిదండ్రులతో ఆ విషయాన్ని చెప్పాను, వారు గ్యారెంటర్స్ సంతకం చేయడానికి

ఒప్పుకున్నారు. అలా మాకు డబ్బు దొరికింది, మైక్ దొరికింది. అంటే నేను ఒక విలువైన

పాఠాన్ని నేర్చుకున్నాను. నా పేరు మీద నేను పొందలేనిది, నా తల్లిదండ్రుల పేరు మీద

పొందగలను.

తన నామంలో తండ్రిని ప్రార్థించమని యేసు మనకు బోధించాడు. దేవునితో మన

క్రియలు తగిన ఆధ్యాత్మిక గ్యారంటీలు కావు. తన రక్తాన్ని కార్చి, నా పాపాలకై మరణించుట

ద్వారా ఆయన నా కొరకు వెల చెల్లించాడు గనుక తండ్రిని యేసు నామంలో ప్రార్థించవలెను.

క్రీస్తు ఏమై యున్నాడో, ఆయన ఏమి చేశాడో దాని ఆధారంగా నేను ప్రార్థించునప్పుడు,

దేవుడు వింటాడు, జవాబిస్తాడు. యేసు నామంలో, ఆయన అధికారంలో, నా ప్రార్థనలకు

జవాబులను నేను అనుభవించగలను.

“యేసు నామములో", పరలోకం గౌరవించే ఒకే ఒక ఆధ్యాత్మిక గ్యారంటీ, ఈ

తేలికైన పదాలు నీ ప్రార్థన ముగింపులో వల్లించేవిగా కాకూడదు. అవి ఖచ్చితంగా

అవసరమైనవి! తండ్రి నిన్ను ఆశీర్వదించాలని, నీ అవసరాలను తీర్చాలని కోరుతున్నాడు.

ప్రార్థించుటకు, నీ మనవుల నిమిత్తం ఆయన కుమారుడు “యేసు నామంలో” నీతో పాటు

సంతకం చేయుటకు ఆయన ఎదురుచూస్తున్నాడు.


ఒక నిలువరమైన పట్టణము జనవరి 5

 

హెబ్రీ. 13:14 - “నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని

కోసము ఎదురుచూచుచున్నాము.”

జనవరి 5

నేను పరలోకం వెళ్ళే దారిలో ఉన్నాను. నన్ను విమోచించి, మహిమ గల

పట్టణపౌరునిగా చేసిన రాజు బిడ్డను, ఆయన ఆత్మ నాలో నివాసం చేస్తున్నాడు. ఆయన

రక్తము నా పాపాన్ని కప్పుతుంది. ఆయన వాక్యం నా హృదయంలో నిలిచి ఉంటుంది.

నేను సంచారం చేస్తున్న యాత్రికున్ని. రాబోవు పట్టణం కొసము వెదకుచున్నాను.

సమస్య. “నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు.” ఈ లోకం, దీని

సుఖభోగాలన్నియు అంతమవుతాయి. వ్యర్థమైన మహిమ కొరకు కట్టబడిన ఆధునిక బాబేలు

గోపురం ఇది. నాశనమే దీని అంతం. దాని అసలు సౌందర్యాన్ని మానవుని పాపం పాడుచేసింది.

దాని అందమైన పుష్పాలు ముల్లులుగాను, గచ్చుపొదలుగాను మారాయి. ఇది సంపూర్ణతలోకి

ఎదుగుట లేదు గాని నాశనం కొరకై అది క్షీణించుచున్నది. ఈ లోకంలో మానవుని జీవితం

గాలి బుడగ లాంటిది గాని అది నిలువరమైనది కాదు.

ప్రాధాన్యత. “ఎదురు చూచుచున్నాము.” క్రైస్తవులు వెదకువారు. రక్షకుడు మనలను

రక్షించుటకు వెదకి కనుగొన్నాడు. ఇప్పుడు మనం ఆయనను, ఆయన పరలోక రాజ్యాన్ని

వెదకుచున్నాము. ఆయనే మన జీవం మరియు మనం ఆశించిన పరలోక విశ్రాంతి ఆయన

పట్టణం. వాల్ స్ట్రీట్, టైమ్ స్క్వేర్, టిన్సెల్ టౌన్ లేదా లాస్ వేగాస్ లోని సుందరమైన

భవనంపై మనకు శ్రద్ధ లేదు. మనం పైనున్నవాటియందు మనస్సు పెట్టాం.

వాగ్ధానం. "రాబోవుచున్న పట్టణము.” ఈ లోకంకంటే అందమైన సుందరమైన

నిత్యపు పట్టణాన్ని యేసు మనకందిస్తున్నాడు. అందులో పాపం, రోగం, బాధ, వ్యాధి,

లేదా మరణం ఉండదు. ప్రేమగల గొట్టెపిల్లయైన యేసు నిత్యం ఏలును. ఆయన

సింహాసనము చేరుటకు రక్తపు మరకలుగల మెట్లను త్వరగా ఎక్కుతాం. మరియు గ్రుచ్చబడిన

ఆయన పాదాల చెంత మన కిరీటాలను పారవేస్తాం. ఆయన సౌందర్యాన్ని తిలకించి

నిత్యం ఆయనను ఆరాధిస్తాం. అదిగో, ఆ పట్టణంలో మనకొరకు ఎంతటి మహిమ

ఎదురుచూస్తుందో!

నీవు నిలువరమైన పట్టణాన్ని వెదకుచున్నావా? పతనమైన ఈ లోకాన్ని వదిలిపెట్టు.

ఇరుకైన (యేసు) మార్గంలో ప్రవేశించి, జీవ మార్గంలో నడువుము. అమర్త్యపు ఆనందం

ప్రవహించే దివ్యమైన స్థలంలో నివాసముండుటకై రమ్ము. పరిశుద్ధ సమూహంతో కలిసి

మహిమలోనికి వెళ్లు!"


ఉజ్వీవానికి మూడు తాళపు చెవులు (Keys) జనవరి 4



2 దినవృత్తాంతములు 7:14

- "నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని

ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను

వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.”

సంఘానికి ఉజ్జీవము అవసరం. సాంప్రదాయం, ఆచారాలు, మతావేశం, నిష్ట,

స్వేచ్ఛవాదం, మన సంఘంలో దేవుని శక్తిని అడ్డుకునే దుర్గాలు. దేవుని తాజా కదలిక

మనకు ఆవసరం, చాలా కొద్దిమంది మాత్రమే రక్షింపబడుతున్నారు. విడుదల

పొందుతున్నారు, నిజమైన ఉజ్జీవపు ద్వారము తెరవగలిగిన మూడు తాళపుచెవులను

ప్రభువిచ్చాడు. అవేవి? అవి ఎలాగు పనిచేస్తాయి?

తగ్గింపు : “నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని”. ఆయన

యెదుట దీనమనస్సు కలిగి ప్రవర్తించాలని దేవుడు ఆదేశిస్తున్నాడు (మీకా. 6:8). గర్వం

మనలోకి వచ్చినప్పుడు దేవుడు బయటికి వెళ్లిపోతాడు. మనమీదే మన దృష్టి నిలుపుకున్నప్పుడు

ఆయనను మనం పోగొట్టుకుంటాము. విరిగి నలిగిన హృదయంతో ప్రభువు యెదుట

వినయపూర్వకంగా కనిపెట్టాలి. తగ్గింపు ఎల్లప్పుడు ఆయన సన్నిధిని ఆకర్షిస్తుంది.

ఆకలి : "ప్రార్థన చేసి నన్ను వెదకి...” ఉజ్జీవం రావాలంటే, దేవుని మందిరము

ప్రార్థన మందిరం కావాలి. అసలు పనిముందు మనం చేసేది ప్రార్థన కాదు; ప్రార్థనే మన

అసలు పని! అధునాతన సంఘాభివృద్ధి టెక్నిక్లు, కార్యక్రమాలు లేదా పద్దతులు మన

ప్రాధాన్యతలు కావు గాని మనం ఆయనను నిస్సహాయులమై వెదకాలి! ఆయనే మన దృష్టి

కేంద్రమై ఉండాలి.

పరిశుద్ధత : “తమ చెడు మార్గములను విడిచినయెడల” మనం పశ్చాత్తాపపడి

ప్రభువుచే పవిత్రపరచబడాలి. ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకొని విడిచిపెడతామో

ఆయన తన కృపను, కనికరాన్ని కుమ్మరిస్తాడు (సామె. 28:13). ఆయనచే శుద్ధి చేయబడిన

చేతులును, హృదయాలను కలిగి వున్నప్పుడు ఆయన ఉజ్జీవపు పరిశుద్ధ పర్వతాన్ని

ఎక్కుతాము. పరిశుద్ధ పాత్రలలో ఆయన తన ఆత్మను ఉంచుతాడు.

ఈ తాళపుచెవులను నీవు వాడినప్పుడు, దేవుడు ఉజ్జీవాన్ని సార్వభౌమత్వంతో

పంపించగలడు. ఆయనకు సరైనదని తోచినప్పుడు ఆయన ఆ వరం ఇస్తాడు. నీవు ఉజ్జీవం

కొరకు సిద్ధపడాలి. తాళపు చెవులు నీ చేతిలో ఉన్నవి. ఉజ్జీవం దేవుని హృదయంలో ఉంది.

నేడు తగ్గింపు, ఆకలి, పరిశుద్ధత నీ జీవిత లక్షణాలుగా ఉండును గాక!


చెప్పకుండా ఉండలేము జనవరి 3



అపొ.కా. 4:20 - “మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక యుండలేము.”

జాన్ రుమేనియా దేశస్తుడు. అధికారులు తమ దేశమునుండి తరిమివేయక ముందు

జాన్ కమ్యూనిస్టుల పాలనలో హింసింపబడ్డాడు, చిత్రహింసకు గురయ్యాడు. యేసును

గురించి ప్రకటించుట ఆపుటకు అతడు తిరస్కరించినందుకు అతడు వెళ్లగొట్టబడెను. తన

భార్యను, పిల్లలను తీసికొని, పెట్టె బేడాతో అమెరికా వెళ్లేందుకై జెట్ను ఎక్కేందుకు జాను

అనుమతినిచ్చారు. సువార్త నిమిత్తం వారు కుటుంబాన్ని, ఇంటిని, ఆస్తిపాస్తులను మరియు

స్నేహితులను వదిలిపెట్టారు!

శతాబ్దాల క్రితం, యూదా ప్రధాన న్యాయస్థానంముందు పేతురు, యోహానులు

నిలువబడ్డారు. యేసును గూర్చి చెప్పడం ఆపమని అధికారులు వారిని హెచ్చరించారు.

అయితే పేతురు, యోహానులు చెప్పక మానలేమని, అందువలన ప్రభువును గురించి

మాట్లాడకుండ వుండలేమన్నారు. చెప్పకయుండలేని విధంగా ఎన్నింటినో వారు చూశారు.

యేసు రోగులను స్వస్థపరచగా, చనిపోయినవారిని లేపగా, దయ్యాలను వెళ్లగొట్టగా, తుఫాను

చెలరేగిన సముద్రాన్ని నిమ్మళింపజేయగా, ఐదువేలమందికి భోజనం

పెట్టగా వారు చూశారు.

ఆయన పునరుత్థానం తరువాత మొదట చూసిన శిష్యులలో వారున్నారు. మాట్లాడకుండ

వుండలేనంతగా వారు విన్నారు. యేసు కొండమీద ప్రసంగిస్తుండగా వారు విన్నారు (మత్తయి

5-7). ఆయన ఉపమానాలనుండి పాఠాలను నేర్చుకున్నారు. ఆయన బృహత్తర ఆజ్ఞను

మొదట పొందినారు (మత్తయి 29:18-20). ఇతరులతో పంచుకొనకుండ వుండి ఆయనను

ఎలా తృణీకరించగలరు? అది గ్రహించుటకు వీలుకానిది. వారు మాట్లాడాల్సిందే!

ఈ మనుష్యులవలె, యేసును గూర్చి మాట్లాడకుండా మనలను ఆపేలా ఈ

శత్రులోకాన్ని అనుమతించకూడదు. మౌనంగా ఉండలేనంతగా మనం కూడా ఎంతో

చూశాము, ఎంతో విన్నాం. రక్షణద్వారా క్రీస్తు మనలను మార్చాడు. ఆయన మన ప్రార్థనలకు

జవాబిచ్చాడు. మనం చెప్పకుండ ఉండలేము గనుక యేసును గురించి చెప్పడం మానలేము!

మరణం నాలుకను మాట్లాడకుండ చేయువరకు, వినే శ్రోతలకు ఆయన కృపను మహిమను

చెబుతూనే ఉండాలి. ఈ రోజు ఒకరితో ఆయన సువార్తను పంచుకో.


మరణం ఓడించబడింది జనవరి 2



1 కొరింథీ. 15:54,55 - "ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ

మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు,

మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ?

విజయమందు మరణము

ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”

టెన్నీసీ నీలాకాశం క్రింద చల్లటి గాలి పర్వత శ్రేణులమీద వీస్తుంది. నా తండ్రి

సమాధియొద్ద నేను నా తల్లితో నిలుచున్నాను. గ్రానైట్ మీద చెక్కబడిన, "జనవరి 2,

1924 జూన్ 11,2000" తేదీలను చూచి, నాన్న నిజంగా చనిపోయాడని గ్రహించాను.

భూమి క్రింద విశ్రాంతి తీసికుంటున్న అతని శరీరం గురించి నేను ఆలోచించగా,

పెరట్లో ఫుట్బాల్న అతనితో ఆడుకోవడం, ఆయన చూస్తుండగా బేస్బాల్ లీగ్ మ్యాచ్లో

సింగిల్ పరుగును తీయడం, మొక్కజొన్న పొలాలలో పావురాలను వేటాడుతూ ఒకరి వీపు

వెనకాల ఒకరం కూర్చుండడం ఆ సంతోషభరితమైన రోజుల్లోకి నా మనస్సు వెళ్ళిపోయింది.

చర్చ్ ఆయన “ఓల్డగ్గెడ్ క్రాస్" అని పాడుతున్నపుడు నేను వినేవాన్ని, నేను పెద్ద చేపను

పట్టినప్పుడు ఆయన నవ్వడం కనిపిస్తుంది. ట్రక్లో ఆయన కూర్చున్న సీట్లను స్పరించగలను.

సెయింట్ లూయిస్ కార్డినల్ ఆడే బేస్బాల్ ఆటను చూడడానికి పెద్ద ట్రక్ ఆయనతో

ఉన్నట్లుగా ఉంది. మేము ప్రయాణిస్తుండగా, తెల్లని పెద్ద టీ షర్ను ధరించి చిరునవ్వు ముఖంతో

భోజనపు బల్లయొద్ద కూర్చుండుట నేను చూస్తున్నాను.

నేను చివరిగా తేరుకొని చూస్తే ఆయన పేరు, తేదీలున్న ఆ రాయి మీదికి నా దృష్టి

మళ్లింది. అప్పుడు నాకో ఆలోచన తట్టింది. ఆ రాయి ఫలకలు చెప్పేది ఆఖరు విషయం

కాదు. ఎందుకు? ఎందుకంటే నాన్న క్రైస్తవుడుగా యుండెను, యున్నాడు. తాను

చనిపోకముందు యేసును ఏరిగాడు కాబట్టి ఇప్పుడు యేసును ఎరుగును. “ఓ మరణమా,

నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” అనే మాటలను గురించి నేను

ఆలోచించాను. పునరుత్థానము మరియు జీవమైయున్నవాడు మరణాన్ని శాశ్వతంగా

ఓం

వణికించే అనుభవంగా ఆరంభమైనది, ఉల్లాసకరమైన అనుభవంగా మారింది.

నేను దూరంగా కారును నడుపుతూ వెళ్తుండగా, యేసు నిజంగా మరణాన్ని ఓడించి, మరణపు

ముల్లును తీసివేశాడని నేను ఎరిగాను. ఎత్తబడువరకు నా తండ్రి భౌతికకాయం విశ్రమిస్తుంది

గాని, ఆ తరువాత ఏ సమాధి అచ్చట అతని దేహాన్ని అట్టి పెట్టలేదు! ఓ మరణమా ఇది

తీసికో! ఓ సమాధి నీ పని అయిపోయింది! జీవాధిపతియైన యేసు శాశ్వతంగా నిన్ను

జయించాడు! నీవు ఓడించబడ్డావు!


నూతన సంవత్సరానికి ఒక ప్రార్థన

 

-

1 దినవృత్తాంతములు 4:10 - "యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొట్ట

పెట్టి - నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి

నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి

ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.”

నన్ను తప్పించుము అని

జనవరి 1

ఒక నూతన సంవత్సరం. ఒక తాజా ప్రారంభం. ఒక నూతన ఆరంభానికి జనవరి

పర్యాయపదం. మనం గతం వైపుచూసి, దానినుండి నేర్చుకోగలం కూడాను గాని, దానిలో

మనం జీవించకూడదు! అంతేకాకుండా, ముందున్న నూతన సంవత్సరాన్ని చేరుటకు దానిని

వెనుక వదలి పెట్టాలి. అలా మనం చేయగా, యబ్బేజు అనే వ్యక్తియొక్క ధైర్యంతో కూడిన

ప్రార్థనను క్రమంగా మనం చేయాలని నేను సూచించనా?

యబ్బేజు పాత నిబంధన కాలంలో జీవించాడు. ఆ పేరుకు అర్థం “వేదన.” యబ్బేజు

పుట్టుక ఎంతో కష్టతరంగా ఉన్నందువలన అతని తల్లి భయంకరమైన పేరుతో అతని

బంధించింది. అయినప్పటికీ, తన పేరు తన జీవితాన్ని నిర్ణయం చేసేదిగా ఉండుటకు

తిరస్కరించాడు యబ్బేజు. అతడు మహా దేవునికి గొప్ప ప్రార్థన చేశాడు. తగిన సమయంలో

గొప్ప ఫలితాలను అనుభవించాడు. అతడు దేనిని అడిగాడు?

మొదట, యబ్బేజు విస్తారమైన సమృద్ధికొరకు ప్రార్థించాడు. "నిశ్చయముగా”

ఆశీర్వదించమని అతడు దేవుని ప్రార్థించాడు. తన జీవితానికి దేవుడు కోరే అతి శ్రేష్టమైన

దానినే తాను కోరాడు. సరిహద్దులు విశాల పరచమని కూడా ప్రార్థించాడు. దేవుని మహిమార్థం

అనేకుల మీద ప్రభావం చూపేలా తన సరిహద్దులను విశాలపరచమని దేవున్ని అడిగడు. ఆ

తరువాత, ఆధ్యాత్మిక అభిషేకంకొరకు దేవుని అడిగాడు. అన్ని, వేళలా దేవుని హస్తం తనకు

బలాన్నివ్యాలని అడిగాడు. సహజాతీతమైన సంరక్షణనిమ్మని అడుగుతూ యబ్బేజు తన ప్రార్ధన

ముగించాడు. దేవుడు తనను కాపాడకపోతే, తాను కనిపెట్టుకొని వుండుట వ్యర్థం అని అతనికి

తెలుసు.

యబ్బేజు ప్రార్ధన నీకు స్వార్థంతో కూడినట్టు అనిపిస్తుందా? అలా అనిపించకూడదు.

నిశ్చయముగా, దేవుడు అతని మనవులను తీర్చాడు! నీవు ప్రార్థించినట్లయితే - యబ్బేజుకు

దేవుడేమి చేశాడో నీకు కూడా చేస్తాడు! ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థిస్తే, ఈ సంవత్సరం

నీకోసం ఏమి దాచిపెట్టబడిందో పరలోకానికే తెలుసు. ప్రార్థనలో పరలోకపు తండ్రితో నీవు

సమయం గడుపుచుండగా, నీవు ఎన్నడు అనుభవించని ఆశీర్వాదకరమైన సంవత్సరముగా

ఈ సంవత్సరం ఉండును గాక! ఆకాశాలు తెరువబడుతాయి, నీవు అడిగిన వాటికంటెను

లేదా ఊహించేవాటికంటెను అధికంగా దేవుడు చేస్తాడు.