Monday, October 10, 2022

ప్రధానమైన ఆజ్ఞ జనవరి 7



మార్కు 12:30 - "నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ

వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను.”

బైబిలులోని ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఒకరోజు శాస్త్రి ఒకడు యేసును అడిగెను.

వెంటనే యేసు ఇచ్చిన జవాబు, లేఖనాధారమైనది కాబట్టి సంపూర్ణమైనది.

సారాంశపూర్వకంగా, ప్రధానమైన ఆజ్ఞ. "దేవుని ప్రేమించవలెను!” అన్నది అని చెప్పాడు.

ఎలా మనం దేవుని ప్రేమించగలం?

ఉద్వేగపూర్వకంగా దేవుని ప్రేమించాలి. "నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ

పూర్ణాత్మతోను... నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను.” “హృదయము”, “ఆత్మ” అనే

పదాలు దేవున్ని ఉద్వేగాలతో ప్రేమించాలని మనకు చూపిస్తాయి. దేవుడు ఒక వ్యక్తి. ఒక

అరూపభావన కాదు. ఆయన మనతో ఉద్వేగపరమైన అన్యోన్యతను పంచుకొనుటకు

ఇష్టపడుతున్నాడు. ఆవేశంతో కూడిన ఉద్వేగాలకు గురికాకుండా చేసినప్పుడే ఇలాగు

జరుగుతుంది.

వివేకముతో దేవుని ప్రేమించాలి. “నీ పూర్ణ వివేకముతోను.. నీ దేవుడైన ప్రభువును

ప్రేమింపవలెను.” దేవుని ప్రేమించుటలో నీ ఆలోచనలు కూడా ఇమిడి ఉంటాయి. మన

మనస్సులు నూతనపరచబడాలని యేసు కోరుతున్నాడు (రోమా 12:2). మన ఆలోచనలు

ఆయనకు విధేయత చూపేలా చెరపట్టాలి (2 కొరింథీ. 10:5). ఆయన తన వివేకంతో

మనకు బోధిస్తుండగా శ్రేష్టమైన వాటినే మనం ఆలోచించాలి (ఫిలిప్పీ. 4:8).

క్రియల ద్వారా దేవుని ప్రేమించాలి. “...నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవా

ప్రేమింపవలెను.” ఆచరణలో విధేయత చూపుతూ దేవుని ప్రేమించాలి. ప్రేమ మనం చేసే

క్రియ! మనం ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా మన

ప్రేమను నిరూపిస్తాం (యోహాను 14:15). క్రీస్తును పోలి నడుచుకొనుట ద్వారా ఆయనపట్ల

మన ప్రేమను ప్రదర్శిస్తాం (1 యోహాను 3:18) క్రియలు లేని విశ్వాసము మృతము

(యాకోబు 2:17). విధేయతతో కూడిన క్రియలద్వారా దేవునిపట్ల మన ప్రేమను నిరూపిస్తాం.

దేవుని ప్రేమించుటే ప్రధానమైన ఆజ్ఞ. మనం పాల్గొనే ఏ మతపరమైన ఆచారాల

కంటే కూడా అన్యోన్యంగా ఆయనతో సహవాసం చేయుటే అతి ప్రాముఖ్యమైన విషయం.

నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నీ కొరకైన ఆయన అమోఘమైన ప్రేమను

హత్తుకున్నావా? నేడు దేవుని ప్రధానమైన ఆజ్ఞకు విధేయత చూపుము. నీ పూర్ణ

హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుము.