అపొ.కా. 4:20 - “మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక యుండలేము.”
జాన్ రుమేనియా దేశస్తుడు. అధికారులు తమ దేశమునుండి తరిమివేయక ముందు
జాన్ కమ్యూనిస్టుల పాలనలో హింసింపబడ్డాడు, చిత్రహింసకు గురయ్యాడు. యేసును
గురించి ప్రకటించుట ఆపుటకు అతడు తిరస్కరించినందుకు అతడు వెళ్లగొట్టబడెను. తన
భార్యను, పిల్లలను తీసికొని, పెట్టె బేడాతో అమెరికా వెళ్లేందుకై జెట్ను ఎక్కేందుకు జాను
అనుమతినిచ్చారు. సువార్త నిమిత్తం వారు కుటుంబాన్ని, ఇంటిని, ఆస్తిపాస్తులను మరియు
స్నేహితులను వదిలిపెట్టారు!
శతాబ్దాల క్రితం, యూదా ప్రధాన న్యాయస్థానంముందు పేతురు, యోహానులు
నిలువబడ్డారు. యేసును గూర్చి చెప్పడం ఆపమని అధికారులు వారిని హెచ్చరించారు.
అయితే పేతురు, యోహానులు చెప్పక మానలేమని, అందువలన ప్రభువును గురించి
మాట్లాడకుండ వుండలేమన్నారు. చెప్పకయుండలేని విధంగా ఎన్నింటినో వారు చూశారు.
యేసు రోగులను స్వస్థపరచగా, చనిపోయినవారిని లేపగా, దయ్యాలను వెళ్లగొట్టగా, తుఫాను
చెలరేగిన సముద్రాన్ని నిమ్మళింపజేయగా, ఐదువేలమందికి భోజనం
పెట్టగా వారు చూశారు.
ఆయన పునరుత్థానం తరువాత మొదట చూసిన శిష్యులలో వారున్నారు. మాట్లాడకుండ
వుండలేనంతగా వారు విన్నారు. యేసు కొండమీద ప్రసంగిస్తుండగా వారు విన్నారు (మత్తయి
5-7). ఆయన ఉపమానాలనుండి పాఠాలను నేర్చుకున్నారు. ఆయన బృహత్తర ఆజ్ఞను
మొదట పొందినారు (మత్తయి 29:18-20). ఇతరులతో పంచుకొనకుండ వుండి ఆయనను
ఎలా తృణీకరించగలరు? అది గ్రహించుటకు వీలుకానిది. వారు మాట్లాడాల్సిందే!
ఈ మనుష్యులవలె, యేసును గూర్చి మాట్లాడకుండా మనలను ఆపేలా ఈ
శత్రులోకాన్ని అనుమతించకూడదు. మౌనంగా ఉండలేనంతగా మనం కూడా ఎంతో
చూశాము, ఎంతో విన్నాం. రక్షణద్వారా క్రీస్తు మనలను మార్చాడు. ఆయన మన ప్రార్థనలకు
జవాబిచ్చాడు. మనం చెప్పకుండ ఉండలేము గనుక యేసును గురించి చెప్పడం మానలేము!
మరణం నాలుకను మాట్లాడకుండ చేయువరకు, వినే శ్రోతలకు ఆయన కృపను మహిమను
చెబుతూనే ఉండాలి. ఈ రోజు ఒకరితో ఆయన సువార్తను పంచుకో.