యోహాను 14: 13, 14
"మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి
కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి
అడిగినను, నేను చేతును.”
నేను క్రైస్తవుడనైన వెంటనే, వివిధ స్థలాలలో నేను, నా స్నేహితుడు కలిసి పాటలు
పాడుచు దేవుని వాక్యాన్ని పంచుకోవడం ఆరంభించాం. మాకు మైక్ కావాలని గుర్తించి
రెండు వేల డాలర్లు అప్పు ఇమ్మని అడుగుటకు బ్యాంక్కు వెళ్ళాం. అప్పు ఇచ్చే అధికారి
ఋణము తీర్చుతామని అభయమిచ్చుటకు జామీను మీ దగ్గర ఏమైనా
ఉందా? మా ఇద్దరి దగ్గర ఏమి లేదు. అప్పు తీర్చుతామన్న వాగ్ధానం తప్ప ఇంకేమి
చేయలేక పోయాం. మీరు ఊహించిన విధంగానే, ఎలాంటి అభయం (గ్యారంటీ లేకుండా
మీ నోటి మాటల మీద బ్యాంకు ఋణము ఇవ్వదు.
ఇలా అడిగాడు
మేము నిరాశతో బయటికి వస్తుండగా, ఆ ఋణాన్నిచ్చే అధికారి ఒక్క మాట
అన్నాడు, దానిని నేనెప్పుడు మరచిపోలేదు. “మీ తల్లిదండ్రులకు ఈ బ్యాంకులో అనేక
ఖాతాలు ఉన్నాయి. వారు గ్యారంటీ ఇస్తే మీకు లోను ఇస్తాము.” నేను నేరుగా ఇంటికెళ్లి,
మా తల్లిదండ్రులతో ఆ విషయాన్ని చెప్పాను, వారు గ్యారెంటర్స్ సంతకం చేయడానికి
ఒప్పుకున్నారు. అలా మాకు డబ్బు దొరికింది, మైక్ దొరికింది. అంటే నేను ఒక విలువైన
పాఠాన్ని నేర్చుకున్నాను. నా పేరు మీద నేను పొందలేనిది, నా తల్లిదండ్రుల పేరు మీద
పొందగలను.
తన నామంలో తండ్రిని ప్రార్థించమని యేసు మనకు బోధించాడు. దేవునితో మన
క్రియలు తగిన ఆధ్యాత్మిక గ్యారంటీలు కావు. తన రక్తాన్ని కార్చి, నా పాపాలకై మరణించుట
ద్వారా ఆయన నా కొరకు వెల చెల్లించాడు గనుక తండ్రిని యేసు నామంలో ప్రార్థించవలెను.
క్రీస్తు ఏమై యున్నాడో, ఆయన ఏమి చేశాడో దాని ఆధారంగా నేను ప్రార్థించునప్పుడు,
దేవుడు వింటాడు, జవాబిస్తాడు. యేసు నామంలో, ఆయన అధికారంలో, నా ప్రార్థనలకు
జవాబులను నేను అనుభవించగలను.
“యేసు నామములో", పరలోకం గౌరవించే ఒకే ఒక ఆధ్యాత్మిక గ్యారంటీ, ఈ
తేలికైన పదాలు నీ ప్రార్థన ముగింపులో వల్లించేవిగా కాకూడదు. అవి ఖచ్చితంగా
అవసరమైనవి! తండ్రి నిన్ను ఆశీర్వదించాలని, నీ అవసరాలను తీర్చాలని కోరుతున్నాడు.
ప్రార్థించుటకు, నీ మనవుల నిమిత్తం ఆయన కుమారుడు “యేసు నామంలో” నీతో పాటు
సంతకం చేయుటకు ఆయన ఎదురుచూస్తున్నాడు.