హెబ్రీ. 13:14 - “నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని
కోసము ఎదురుచూచుచున్నాము.”
జనవరి 5
నేను పరలోకం వెళ్ళే దారిలో ఉన్నాను. నన్ను విమోచించి, మహిమ గల
పట్టణపౌరునిగా చేసిన రాజు బిడ్డను, ఆయన ఆత్మ నాలో నివాసం చేస్తున్నాడు. ఆయన
రక్తము నా పాపాన్ని కప్పుతుంది. ఆయన వాక్యం నా హృదయంలో నిలిచి ఉంటుంది.
నేను సంచారం చేస్తున్న యాత్రికున్ని. రాబోవు పట్టణం కొసము వెదకుచున్నాను.
సమస్య. “నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు.” ఈ లోకం, దీని
సుఖభోగాలన్నియు అంతమవుతాయి. వ్యర్థమైన మహిమ కొరకు కట్టబడిన ఆధునిక బాబేలు
గోపురం ఇది. నాశనమే దీని అంతం. దాని అసలు సౌందర్యాన్ని మానవుని పాపం పాడుచేసింది.
దాని అందమైన పుష్పాలు ముల్లులుగాను, గచ్చుపొదలుగాను మారాయి. ఇది సంపూర్ణతలోకి
ఎదుగుట లేదు గాని నాశనం కొరకై అది క్షీణించుచున్నది. ఈ లోకంలో మానవుని జీవితం
గాలి బుడగ లాంటిది గాని అది నిలువరమైనది కాదు.
ప్రాధాన్యత. “ఎదురు చూచుచున్నాము.” క్రైస్తవులు వెదకువారు. రక్షకుడు మనలను
రక్షించుటకు వెదకి కనుగొన్నాడు. ఇప్పుడు మనం ఆయనను, ఆయన పరలోక రాజ్యాన్ని
వెదకుచున్నాము. ఆయనే మన జీవం మరియు మనం ఆశించిన పరలోక విశ్రాంతి ఆయన
పట్టణం. వాల్ స్ట్రీట్, టైమ్ స్క్వేర్, టిన్సెల్ టౌన్ లేదా లాస్ వేగాస్ లోని సుందరమైన
భవనంపై మనకు శ్రద్ధ లేదు. మనం పైనున్నవాటియందు మనస్సు పెట్టాం.
వాగ్ధానం. "రాబోవుచున్న పట్టణము.” ఈ లోకంకంటే అందమైన సుందరమైన
నిత్యపు పట్టణాన్ని యేసు మనకందిస్తున్నాడు. అందులో పాపం, రోగం, బాధ, వ్యాధి,
లేదా మరణం ఉండదు. ప్రేమగల గొట్టెపిల్లయైన యేసు నిత్యం ఏలును. ఆయన
సింహాసనము చేరుటకు రక్తపు మరకలుగల మెట్లను త్వరగా ఎక్కుతాం. మరియు గ్రుచ్చబడిన
ఆయన పాదాల చెంత మన కిరీటాలను పారవేస్తాం. ఆయన సౌందర్యాన్ని తిలకించి
నిత్యం ఆయనను ఆరాధిస్తాం. అదిగో, ఆ పట్టణంలో మనకొరకు ఎంతటి మహిమ
ఎదురుచూస్తుందో!
నీవు నిలువరమైన పట్టణాన్ని వెదకుచున్నావా? పతనమైన ఈ లోకాన్ని వదిలిపెట్టు.
ఇరుకైన (యేసు) మార్గంలో ప్రవేశించి, జీవ మార్గంలో నడువుము. అమర్త్యపు ఆనందం
ప్రవహించే దివ్యమైన స్థలంలో నివాసముండుటకై రమ్ము. పరిశుద్ధ సమూహంతో కలిసి
మహిమలోనికి వెళ్లు!"