Monday, October 10, 2022

మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి జనవరి 9



హగ్గయి 1:3-5 - “అందుకు యెహోవా వాక్కు, ప్రత్యక్షమై ప్రవక్తయను హగ్గయి

ద్వారా సెలవిచ్చినదేమనగా - ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీ వేసిన యిండ్లలో

నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా

సెలవిచ్చునదేమనగా - మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి!”

చర్చిలో నా ఆఫీసులో వున్న ఫోన్ మ్రోగింది. నాకు ఫోనుచేసినవ్యక్తి, సంఘ సభ్యురాలు,

ఈ విధంగా నన్ను సంబోధించింది - "పాస్టర్గారు, నా భర్త, నేను రెండు రాకింగ్ కుర్చీలను

తెచ్చాం, మా దగ్గరవున్న పాత వాటిని చర్చిలో ఉన్న నర్సరీకి విరాళం ఇవ్వడానికి

ఇష్టపడుచున్నాం. వాటి కొరకు పన్ను మినహాయింపును కూడా పొందాలనుకుంటున్నాం

అనుకొండి!” నేను అప్పుడు యవ్వనప్రాయంలో ఉంటిని, బహుశా కొంచెం కఠినంగా జవాబు

ఇచ్చానేమో. “అమ్మా, మేము పన్ను రాయితీ ఇవ్వం. ఎందుకంటే ఆ కుర్చీలు మాకు అవసరం

లేదు. దేవుడు నీ శ్రేష్టమైన వాటికి అర్హుడు. క్రొత్త కుర్చీలను ఇస్తే మంచిది. అయితే పాత

కుర్చీలు దేవునికి అవసరం లేదు” అని అన్నాను.

బబులోను చెరలోనుండి యెరూషలేముకు దేవుని ప్రజలు తిరిగి వస్తున్న కాలంలో

హగ్గయి ప్రవక్త జీవించెను. వారు తిరిగిరాగానే యెరూషలేములోని దేవాలయాన్ని

పునర్నిర్మించమని వారికి దేవుడు ఆజ్ఞాపించాడు. దానికి బదులుగా, ప్రజలు తమ గృహాలను

నిర్మించుకుంటూ, దేవుని మందిరాన్ని పదిహేను సంవత్సరాలు అశ్రద్ధ చేస్తూ “మందిరం

కట్టుటకు ఇది సమయం కాదు” అని వారు చెబుతూ వచ్చారు. హగ్గయి వారిని ఎదురించి

ఇలా అన్నాడు - "ఈ మందిరము పాడైయుండగా, మీరు సరంబీ వేసిన ఇండ్లలో

నివసించుటకు ఇది సమయమా? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి!”

నీ పాత వస్తువులు లేదా సేవలు దేవునికి ఇష్టం లేదు. అతి శ్రేష్టమైనవి పొందుటకు

అతడు అర్హుడు. గృహాలకు, కార్లకు, మిగతా ఆస్తిపాస్తులకు కట్టేందుకు వారికి డబ్బుంది

గాని దశమ భాగాలతో, కానుకలతో స్థానిక సంఘాన్ని బలపరచుటకు వారు విస్మరిస్తారు.

నీ స్వంత ఇంటివలె నీవు ఆరాధించే మందిరం సుందరంగం ఉందా లేదా అని నిన్ను నీవు

ప్రశ్నించుకొనుము. లేకపోతే, ఎందుకు లేదు? నీవు చేసేదాన్నంతటిలో అతి శ్రేష్టమైనవాటినే

దేవునికి ఇచ్చుటకు శ్రద్ధ తీసికొనుము. యేసును భూమి మీదికి పంపించినప్పుడు ఆయన

. నీకు శ్రేష్టమైన దానిని ఇచ్చాడు. దానిని గుర్తు పెట్టుకొని, నీ ప్రవర్తనను గురించి

ఆలోచించుకొనుము!