కొలస్స. 3:16 -
"సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన
పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ
హృదయములలో దేవునినిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు
వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.”
సి.హెచ్. స్పర్జన్రి ఒక సందేశాన్ని నేను చదువుచుండగా, దానిలోవున్న అనేక
బైబిలు వచనాలను చూచి నేను ఆశ్చర్యపోయాను. 1800ల కాలంలో దాదాపు నలభై
సంవత్సరాలు లండన్లో ప్రతి ఆదివారం ఆరువేలమందికి పైగా ఆయన బోధించాడు.
అపొల్లో వలె ఆయన కూడా “లేఖనములయందు ప్రవీణుడు” (అపొ.కా. 18:24). పరిశుద్ధ
పాఠ్యభాగం సమృద్ధిగా ఆయనలో నివసించెను. క్రీస్తు కొరకు బీద ప్రజల సమూహాలను
చేరేలా ఆయనను దేవుడు వాడుకున్నాడు. స్పర్జన్ ఇంతకు ముందే సువార్తతో సామాన్య
ప్రజల మనస్సులను నింపాడు. కాబట్టి కమ్యూనిజం, తన దయ్యపు సిద్ధాంతాలతో ఇంగ్లాండ్
దేశంలోకి చొచ్చుకొనిపోనందుకు ఆ తరువాత విలపించింది!
మనలో ఆయన వాక్యం సమృద్ధిగా నివసించేలా అనుమతినివ్వాలని దేవుడు
కోరుతున్నాడు. దానిని మనమెలా చేయగలం? మొదటిగా, దేవుని వాక్యాన్ని మనం
చదువగలం. ప్రతి రోజు నెమ్మదిగా, గట్టిగా, దానిలోని సత్యాలను గ్రహించుటకు ఆశతో
చదువవచ్చును. ఆత్మపూర్ణులైన బోధకులు, సందేషకులు ప్రకటించుచుండగాను, అదే విధంగా
సంగీత కళాకారులు (“పాటలు, కీర్తనలు ఆత్మ సంబంధమైన గీతాలు") పాడినప్పుడు
వినుటద్వారా కూడా మనం దేవుని వాక్యాన్ని వినగలం. మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం
చేయగలం. వాటి అర్థాన్ని కనుగొనేందుకు ప్రతి దినమును లేఖనములు పరిశోధించవచ్చును.
(అపొ.కా. 17:11). మనం దేవుని వాక్యాన్ని కంఠస్థంచేయాలి. (సామె. 7:1) విలువగల
సంపదగా దానిని మన హృదయములో భద్రపరచుకొంటూ, మరియవలె, దేవుని వాక్యం
ధ్యానిస్తూ, దాని అర్థం స్పష్టంగా తెలిసేంతవరకు మన హృదయాలలో మళ్లీ మళ్లీ మననం
చేసికుంటూ చేయాలి. మరియు మనం దేవుని వాక్యానికి విధేయత చూపాలి అ
వినుటలోను, చేయుటలోను. చివరిగా, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా బోధిస్తూ హెచ్చరిస్తూ
దేవుని వాక్యాన్ని పంచుకోవాలి.
ఆకలిగొనిన ప్రాణాలకు పరలోకమన్నా మరియు దప్పికగొన్న హృదయాలకు
జీవజలం బైబిలు ప్రభువు మంచివాడని రుచిచూచి తెలిసికొనుటకు అది పాలు,
మాంసంలాంటిది. నీ బైబిలును తెరువుము. ఆధ్యాత్మిక విందుకై కూర్చొనుము. ఈనాడు
ఆయన వాక్యం నీలో సమృద్ధిగా నివసింపనీయుము!