Monday, October 10, 2022

అతిశయ కారణం జనవరి 10



యిర్మీయా 9:23,24 - "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - జ్ఞాని తన

జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు,

ఐశ్వర్యవంతుడు, తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని

బట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న

యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టియే అతిశయింపవలెను.

అట్టివాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”

గర్వం, దురహంకారం అసందర్భమైనవి, మింగుడుపడనివి. అది ఎంత

బాధాకరమైనది, కౄరమైనది, నిందార్హమైనది. అయినప్పటికీ, మన రోజుల్లో, క్రైస్తవులలో

కూడా అతిశయము ఇంకా ప్రబలంగానే ఉంది, దేవుని బిడ్డ ఏ విషయంలో అతిశయపడాలో,

అతిశయపడకూడదో మన లేఖన భాగం చెబుతుంది.

మనం జ్ఞానాన్నిబట్టి అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానాన్నిబట్టి

అతిశయింపకూడదు. అమోఘమైన పరిజ్ఞానం, ఆలోచనా సామర్థ్యం గల మేధావులెంతో

మంది ఉన్నారు. అయినా వారు దేవుని యెదుట అతిశయపడకూడదు. ఆయన మార్గాలు,

ఆలోచనలు మానవునికంటే ఉన్నతమైనవి. సర్వజ్ఞుడైన దేవునితో పోల్చిచూస్తే, గొప్ప

తెలివిమంతుడు కూడా మానసిక మరుగుజ్జులాంటివాడే.

మనం శౌర్యాన్నిబట్టి అతిశయింపకూడదు. బలవంతుడు తన బలాన్నిబట్టి

అతిశయింపకూడదు. ఇంతకుముందుకంటే నేటి క్రీడాకారులు దృఢమైన, వేగంగల, భారీ

శరీరాలుగలవారు. అయినప్పటికీ, తన శక్తినిబట్టి ఏ మానవుడు దేవుని యెదుట

అతిశయింపకూడదు. సర్వశక్తిగల దేవునితో పోల్చినప్పుడు మానవ బలప్రదర్శన విచారకరంగా

నిర్బలమే.

మనం ఐశ్వర్యాన్నిబట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్నిబట్టి

అతిశయింపకూడదు. కోటీశ్వరులు ప్రపంచ సంపదను నియంత్రించవచ్చును గాని అది

వారికి నకిలీ భద్రత మరియు అధికార భావనను కలిగిస్తుంది. ధనం నిజమైన ఐశ్వర్యానికి

సూచిక కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును (సామె. 10:22).

ఆశీర్వదింపబడ్డాము గనుకనే మనం ఐశ్వర్యవంతులం, గాని ఐశ్వర్యవంతులం గనుక

ఆశీర్వదింపబడలేదు.

యేసు క్రీస్తు ద్వారా దేవుని వ్యక్తిగతంగా ఎరిగినవారు, ఈ భూమి మీద జ్ఞానవంతులు,

బలవంతులు మరియు ఐశ్వర్యవంతులు. పరలోకపు శ్రేష్టమైన మహిమకు మరియు

అతిశయానికి అర్హుడు కేవలం యేసు మాత్రమే. నేడు మరియు నిత్యం ఆయనయందే నీవు

అతిశయపడుము.