Monday, October 10, 2022

నూతన యెరూషలేము జనవరి 31

ప్రకటన 21:1,2 - "అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని,

మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు..

మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు

అలంకరించబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవునియొద్దనుండి దిగి

వచ్చుట చూచితిని."

దైవిక అగ్నిచే ఈ లోకం నాశనం చేయబడే రోజు ఒకటి వస్తుంది (2 పేతురు

3:7-13). దేవుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమితో దానిని మార్చుతాడు. "నూతన

యెరూషలేము" అని పిలువబడే మహిమకరమైన పట్టణాన్ని ఆవిష్కరిస్తాడు. అన్ని యుగాలకు

చెందిన విమోచింపబడిన జనాంగం ఆయనతో కూడా దానిలో నివాసం చేస్తారు.

బైబిలులోని చివరి రెండు అధ్యాయాలు ఆ అద్భుత స్థలాన్ని గురించి చెబుతాయి.

అది నూతన పట్టణము (21:1,2, 4-5). ఈ భూమి మీదనున్న పట్టణాలవలెగాక, అది

ఎన్నటికి పాడవదు. మరమత్తులు అవసరంలేదు. అది సంపూర్ణంగా నిత్యం అలంకరింపబడి

వుంటుంది. అది పరిశుద్ధ పట్టణము కూడా (21:2,3,8), అది పెండ్లి కుమార్తెవలె

పవిత్రమైనది. పరిశుద్ధమైనది. క్రీస్తును తిరస్కరించిన పావులు అందులో ఉండరు. అది

సంతోషకరమైన పట్టణము (21:4). అక్కడ రోగం గాని, దుఃఖం గాని, శ్రమలు గాని

ఉండవు. యేసు సన్నిధిలో సంతోషంగా ఉంటాం. అది ఆశీర్వదించబడిన పట్టణము (21:6,7,

22:1-3) పాపము శాపం అక్కడ ఉండదు. జీవజలం పారుతూ, జీవవృక్షం వికసిస్తుంది.

ఆకులలో స్వస్థత ఉంటుంది. అది సుందరమైన పట్టణం (21:9-21), బంగారపు వీధులు,

రత్నపు గోడలు, ముత్యాల గుమ్మాలు అది క్రీస్తు కేంద్రిత పట్టణము (21:22-26), సూర్యుని,

చంద్రుని, నక్షత్రాల స్థానంలో యేసే ప్రకాశిస్తాడు. చివరగా, అది ప్రత్యేకమైన పట్టణం

(21:27; 22:10-17). యేసు రక్షకునిగా ఎరిగినవారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు.

నూతన యెరూషలేములో నీవుంటావా? నీవు ఆ బంగారపు వీధులను చూస్తావా?

అలాంటి సుందరమైన భూభాగంలో యేసు కాంతి నీ ముఖం మీద ప్రకాశిస్తుందా? దేవుని

జీవజలపు ఊటనుండి నీవు త్రాగుతావా? అలాగైతే, సంతోషించి, పాడుము. "నేను యేసును

చూసే ఆ దినం ఎలాంటిది. నేను ఆయన ముఖాన్ని చూచినప్పుడు, తన కృపద్వార

రక్షించినవాడు, నా చేతులను తన చేతులలో పట్టుకొని వాగ్దాన భూమికి నన్ను

నడిపించుచుండగా, ఆ రోజు ఎలాంటి రోజు, మహిమకరమైన రోజు"