ప్రకటన 20:15
యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను.”
-
“ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని
ఒక రోజున ప్రతి ఒక్కరం సర్వ శక్తిమంతుడైన దేవుని యెదుట నిలబడి ఈ భూమి
మీద మనం జీవించిన జీవితానికి లెక్క అప్పజెప్పుతాము. మరోజన్మ ఒక అభూత కల్పన.
పర్గెటరి (కాథోలిక్కు వారి సిద్ధాంతం ప్రకారం స్వర్గానికి వెళ్లకముందు అగ్ని చేత
పరిశుద్ధపరచబడడానికి ఆత్మలుండే స్థలం) లేఖన విరుద్ధం. జీవించుటకు రెండవ అవకాశం
లేదు. ఒక్కసారే అందరం చనిపోతాం. ఆ తరువాత తీర్పు జరుగుతుంది (హెబ్రీ. 9:27).
యుగాంతమందు తీర్పుల పరంపర కొనసాగుతుంది. ఎత్తబడే సమయములో
సజీవులైన క్రైస్తవులు యేసు న్యాయపీఠం ఎదుట నిలువబడతారు. వారి క్రియలు
పరీక్షింపబడతాయి (2 కొరింథీ. 5:10). దేవుని కిష్టమైన క్రియలు నిత్యత్వపు పరలోక
బహుమానాలను పొందుతాయి. ఆయనకు ఇష్టంగాని క్రియలు దహించబడతాయి (1
కొరింథీ. 3:10-15). తరువాత, ఆయన రెండవ రాకడలో యేసు తిరిగి వచ్చినప్పుడు
పాత నిబంధన ప్రవక్తలు పునరుత్థానులవుతారు. బహుమానాలు పొందుటకు తీర్పు
తీర్చబడతారు (దానియేలు 12:1-3, ఆ సమయంలోనే శ్రమలకాలంలో రక్షింపబడిన
ప్రజలు తీర్పు తీర్చబడతారు (ప్రక. 20:4-6). శ్రమలను తప్పించుకున్న క్రైస్తవేతరులు
కూడా తీర్పు తీర్చబడి నిత్యాగ్నిపాలవుతారు (మత్తయి 25:31-46). క్రీస్తు వెయ్యేండ్ల
పాలన అనంతరం సాతాను, దయ్యాలు తీర్పు తీర్చబడతారు. వారు అగ్నిగుండం పాలవుతారు.
(ప్రక. 20:7-10). చివరగా, నశించిన వారందరు పాతాళంనుండి తీయబడి సాతానుతో
అగ్నిగుండంలో త్రోయబడతారు (ప్రక. 20:11-15). అదే ఆఖరు తీర్పు. ఆ తరువాత
ప్రభువు ఆకాశాన్ని, భూమిని నాశనం చేసి నూతన యెరూషలేమును క్రిందికి పంపిస్తాడు.
నీవు దేవుని యెదుట నిలువబడతావు. నీవు సిద్ధమేనా? క్రైస్తవుడా నీ క్రియలు
తీర్పును ఎదుర్కొంటాయి. నీకు బహుమానాలు ఉంటాయా? లేదా నీ అవిధేయత క్రియలు
దహించబడతాయా? నీవు నశించితే, అగ్నిగుండంలో వేయబడతావు. దేవునికి అలా జరగడం
ఇష్టం లేదు! నీ జీవితాన్ని క్రీస్తుకు ఇమ్ము. ఈ జీవితంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆఖరు తీర్పు మరియు భయంకరత్వంనుండి నిన్ను రక్షిస్తాడు.