Wednesday, October 12, 2022

మన సృష్టికర్తయైన దేవుడు ఫిబ్రవరి 1



ఆదికాండం 1:1 "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను."

"దేవుడు ఉన్నాడని నిరూపించుము" అని అహంకారియైన కాలేజీ ప్రొఫెసర్ క్లాసు

రూమ్ నిండా క్రొత్తగా చేరిన, భయంతో వున్న, ఆశ్చర్యంగా చూస్తున్న అమాయకులైన

విద్యార్థులతో హేళనగా అన్నాడు - "సృష్టిక్రమాన్ని గురించి బైబిలు వివరణ కేవలం మతపరమైన

కట్టుకథే అని విజ్ఞాన శాస్త్రం నిరూపించింది. వివిధ రకాల జీవన రూపాలు కోట్లాది

సంవత్సరాలు యాదృచ్ఛికంగా మార్పు చెందడం వలన మానవుడు రూపాంతరం చెందాడని

ఋజువుతో నిరూపింపబడింది. సృష్టి అనేదే లేదు, దేవుడు లేడు!" ఆ ప్రొఫెసర్ చెప్పింది.

సరైనదేనా? మానవుడు నిజంగా జంతువుకంటే ఎక్కువ యేమి కాదా? జీవించుటకు ఈ

జీవితమేనా ఉంది?

విశ్వపు ఉనికికి సంబంధించిన వాస్తవాలను కనుగొనేందుకు, కొద్ది మాసాలకే

పాతదైపోయే విజ్ఞానశాస్త్ర గ్రంథాన్ని గాక యుగాల గ్రంథాన్ని ఒకడు చదవాలి. మనకు

తెలిసిన విధంగా, కాలం ఆరంభమయ్యేసరికే దేవుడు మాత్రమే ఉన్నాడని బైబిలు చెబుతుంది.

అనంతుడుగా, ఆకారణకుడైన కారకునిగా మార్పులేనివాడుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు,

సర్వజ్ఞాని, నిత్యుడు, తన వాక్కు శక్తిచే సమస్తాన్ని, అణువునుండి సౌరవ్యవస్థను సృజించాడు.

ఆయనే జీవమై, జీవానికి మూలమై యున్నాడు. సృష్టిలోవున్న జీవపరమైన నిర్మాణాలను

మానవుడు తదనుగుణంగా మలచుకోవచ్చును గాని దేవుడు మాత్రమే శూన్యంలోనుండి

సృజించగలడు. మన సృష్టికర్తయైన దేవుని శక్తి ఇది!

నాస్తిక పరిణామవాదుల అశాస్త్రీయ సిద్ధాంతాలు అనేకలోపాలతో, పక్షపాతంతో,

పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఆయనకు మానవుడు జవాబుదారిగా ఉండాల్సివస్తుందన్న

జంకుతోనే సృష్టికర్త ఉన్నాడనే ఆలోచనను వారు తిరస్కరిస్తున్నారు. నాస్తిక పరిణామవాది

ఆ విషయంలో అతి స్వార్థపరుడు.

దేవుడున్నాడు మరి మనం ఆయనను వ్యక్తిగతంగా మనం తెలుసుకోగలం. సృష్టి

యొక్క వాస్తవం సృష్టికర్తను అడుగుతుంది. మనం కోట్లాది సంవత్సరాలు అధమ స్థాయి

రాసుల నుండి మార్పు చెందుతూ పరిణామం చెంది, ప్రమాదవశాత్తు వచ్చిన వారము

కాము. దేవుడు తన స్వరూపంలో ఆయన మహిమార్థం మనలను సృజించాడు. యేసు

క్రీస్తులో రక్షణ ద్వారా ఆయన మనలను పునర్సృష్టి చేస్తాడు. సృష్టికర్తయైన దేవునికే సమస్త

మహిమ స్తుతులు కలుగును గాక!