Monday, October 10, 2022

క్రీస్తు వెయ్యెండ్ల పాలన జనవరి 29

- ప్రకటన 20:4 - "అంతట నింహాసనములను చూచితిని, వాటి మీద

ఆసీనులైయుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర

మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని

చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన

సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారిని

ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై వెయ్యి సంవత్సరములు, క్రీస్తుతో కూడ రాజ్యము

చేసిరి.”

పశ్చిమ ఆసియాలో శాంతి. ప్రతి అమెరికా అధ్యక్షుడు సాధించాలని ప్రయాసపడేది

దాని కొరకే. అయినా, పశ్చిమ ఆసియాలో లేదా మిగతా ప్రపంచంలో, సమాధాన అధిపతియైన

యేసుక్రీస్తు భూమి మీదకు తిరిగి వచ్చేంత వరకు శాశ్వత శాంతి ఉండదని బైబిలు బోధిస్తుంది.

మహాశ్రమల అనంతరం అందరి మీద సార్వభౌముడైన రాజుగా తనకు తానే స్థాపించుకొనుటకు

యేసు తిరిగి వస్తాడు. ఆయన ప్రజాస్వామ్యానికి కాదు. దైవ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు.

భూమిమీద ఏలడం ఎలా జరగాలో ప్రజలు “ఓటు” వేసి లేదా సలహాలిచ్చి నిర్ణయించరు.

అయితే యేసు సమస్తానికి ఆధిపత్యం వహిస్తాడు. యెరూషలేము ఆయన ముఖ్యపట్టణము.

అక్కడనుండి దేవుని మాట బయటికి వచ్చి సముద్రము నీరు భూమిని ఆవరించినట్లుగా

కప్పుతుంది. యేసుక్రింద రాజైన దావీదు సామంతరాజుగా ఉంటాడు (యెషయా 37:24-

28). పన్నెండుమంది అపొస్తలులు పండ్రెండు ఇశ్రాయేలు గోత్రాలమీద ప్రభుత్వం చేస్తారు.

(మత్తయి 19:28). మిగతా పరిశుద్ధులు భూమిని ఏలుటకు పునరుత్థానులవుతారని మన

వాక్యభాగం చెబుతుంది.

క్రీస్తు వెయ్యేండ్లపాలనలో ఇంతకుముందెన్నడులేని రీతిగా శాంతి ఉండును. ఇది

అత్యంత అశాంతితో నిండిన మహాశ్రమల అనంతరం ఆరంభమవుతుంది. ఒకదానిమీద

ఒకటి దాడిచేసే జంతువులు సమాధానంలో జీవిస్తాయి. ఒకప్పుడు "కౄరంగా” వున్న

జంతువులతో పిల్లలు ఆడుకుంటారు. యుద్ధాలు సమసిపోతాయి. మానవుడు సర్వదా శాంతితో

జీవిస్తాడు (యెషయా 2:1-4; 11:1-10).

దేవుని రక్షణ చరిత్రలో యేసు వెయ్యేండ్ల పాలన ఆవశ్యకత ఎందుకని నీవు నన్ను

అడుగవచ్చును. వెయ్యేండ్ల పాలన ఏదేనులో పరదైసును పునరుద్ధరిస్తుంది. మహాశ్రమలను

కొట్టివేయును. క్రీస్తు విరోధికి బదులు క్రీస్తు పాలన ఉంటుంది. స్వర్గానుభవమునకు సూచనముగా

ఉన్నది. అక్కడ నీవుంటావా? క్రీస్తు నీ రక్షకుడైతే రాజుగా భూమి మీద ఒకనాడు పరిపాలించడం

నీవు చూస్తావు!