మత్తయి 24:21 - “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు.
ఇక ఎప్పుడును కలుగబోదు.”
ఈ భూమి మీదను, దాని నివాసుల మీదను దేవుడు తను ఆపలేని మహా ఉగ్రతను
కుమ్మరించే రోజు ఒకటి వస్తుంది. యేసు ఆ కాలాన్ని “మహాశ్రమలు” అని పిలిచాడు.
భూమి మీద నరకం ఏడు సంవత్సరాలు కొనసాగుతుంది. ఇది ఎత్తబడుటకు తన సంఘము
కొరకు క్రీస్తు వచ్చిన వెంటనే ఆరంభమవుతుంది. ప్రకటన గ్రంథం 6-19 అధ్యాయంలో
ఈ భయంకరమైన సమయంలో జరుగు సంఘటనలు వివరించబడ్డాయి. దేవుని ఉగ్రతను
పాపం మీదను, పాపుల మీదను పోయుటకై యేసు ఏడు తీర్పు ముద్రలను విప్పును.
యుద్ధం, కరువు, రోగం, మరణం ప్రపంచమంతట అనుకోనివిధంగా సంభవిస్తాయి.
భవిష్యత్తు ఎవరికి ఆసక్తికరంగా ఉండదు. మనిషి జీవంకంటె మరణాన్నే కోరుకుంటాడు.
ఏడు ముద్రల తరువాత, ఏడు తీర్పు బూరలు ఊదబడతాయి. ఈ బూరల ధ్వని
నుండి వచ్చే తెగుళ్లలో ఐదు మాసాల కాలంలో అక్షరాల దయ్యాలు మానవులను అలుపెరుగక
బాధిస్తాయి. బూరల తరువాత దేవుడు ఏడు తీర్పు పాత్రలు కుమ్మరింపజేస్తాడు. ప్రతి
పర్వతం, దీపం అదృశ్యమవుతుంది. సముద్రాలు, తాజా జలాలు రక్తంవలె మారుతాయి.
రాచపుండ్లు ప్రజలందరిని బాధిస్తాయి. క్రీస్తు విరోధి అధికారాన్ని చేపట్టి ప్రపంచాన్ని ఏలుతాడు.
వాడు ఒక ముద్రను వేస్తాడు అది లేకుండా ఎవరూ దేనిని కొనలేరు. వాడు తనను
ఆరాధించాలని, దేవుని దూషించాలని కోరుతాడు. ఏడు సంవత్సరాల అంతంలో, యేసు
ఎత్తబడిన క్రైస్తవులతో తిరిగి వచ్చి క్రీస్తు విరోధిని హెర్మెగిద్దోను యుద్ధంలో ఓడించి
రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పట్టాభిషిక్తుడవుతాడు!
యేసు క్రీస్తును రక్షకుడిగా ఎరిగిన మనం 'రాబోయే ఉగ్రత' (1 థెస్స. 1:10) అని
బైబిలు పిలిచే ఈ మహా శ్రమల కాలాన్ని తప్పించుకుంటాము. అందుకు మనం కృతజ్ఞులం.
కాని శ్రమల భయాందోళనలను ఎదుర్కొనేందుకు కోట్లాది మంది ప్రజలు విడువబడతారు!
నీ విషయమేమిటి? ఎత్తబడి పైకి వెళ్తావా? లేదా విడువబడతావా?