Monday, October 10, 2022

బడ జనవరి 26

1 థెస్స. 4:16,17 - "ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను దేవుని

బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైనవారు మొదట

లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును

ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము

సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.”

యేసు తన బిడ్డలను భూమిమీదినుండి కొనిపోయే సమయం వస్తుంది, అది ఈ

రోజే కావచ్చును. ఆ సంఘటనను “ఎత్తబడుట" అని పిలుస్తారు (రాప్చర్ అనే ఇంగ్లీషు

పదం "ర్యాపియో” అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఆ పదానికి అర్థం - హఠాత్తుగా

లాగుకొనుట) అది ఎప్పుడు జరుగునో ఎవరికి ఖచ్చితంగా తెలియదు (మత్తయి 24:36).

కాని దానికిముందు, ప్రజలు "మామూలుగానే జీవన వ్యవహారాలలో" మునిగిపోతూ ఈ

విషయాన్ని పట్టించుకోలేని దృక్పథాన్ని కలిగి వుందురు (లూకా 17:26-30). క్రైస్తవ్యం

యొక్క నిజమైన విశ్వాసంనుండి వారు తప్పిపోతారు. తప్పుడు మతాలవైపు, సాతాను

వ్యవస్థవైపు, దయ్యపు బోధలవైపు (1 తిమోతి 4:1,2) మళ్లుదురు. సమాజమంతటిలో

తీవ్రమైన వత్తిడి ఉండును (2 తిమోతి 3:1-5). ఈ లక్షణాలు మనం ప్రస్తుతం జీవిస్తున్న

సమయాలను చక్కగా వర్ణిస్తాయి.

మహాశ్రమల ముందు సంఘం ఎత్తబడుతుంది. దేవుని ప్రజలకు మనుష్యుల వలన

హింస కలుగును గాని దేవుని ఉగ్రత వారికుండదు. శ్రమలకాలం క్రైస్తవులు ఎదుర్కోవాలని

బోధించేవారు. క్రీస్తు ఏక్షణంలోనైనా తిరిగి వస్తాడని నమ్మరు. వారు తప్పుగా బోధిస్తున్నారు.

క్రీస్తు తప్పక వస్తాడనే వెలుగులో మనం జీవించాలి (మత్తయి 24:40-34).

ఎత్తబడే దృశ్యం అద్భుతమైనది. యేసు కనబడతాడు. ప్రధాన దూత ఆర్భాటం

చేస్తాడు. దేవుని బూర ఊదబడుతుంది. పరిశుద్ధులు ఎత్తబడతారు. ఇది అకస్మాత్తుగా

జరుగుతుంది. రెప్పపాటులో జరిగిపోతుంది (1 కొరింథీ. 15:51,52). ఇది ఏర్పాటు

సమయం కూడ. క్రైస్తవులు ఎత్తబడతారు, క్రైస్తవేతరులు విడువబడతారు (లూకా

17:34-36).

ఎత్తబడుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? "రాబోయే ఉగ్రత” నుండి యేసు మాత్రమే

నిన్ను రక్షించగలడు (1 థెస్స. 1:10). రక్షకునిగా ఆయనయందు నమ్మికయుంచి, నమ్మకంగా

సేవించుము. పాత ఆంగ్ల కీర్తన మాటలను ఆలోచించుము: “యేసు భూమి మీదికి తిరిగి

రాబోతున్నాడు. అది ఈ రోజే అయితే ఏమవును?”