1 థెస్స. 4:16-17 - "ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్ధముతోను దేవుని
బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైనవారు మొదట
లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును
ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము
సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.”
బైబిలులో పేర్కొనబడిన ఆరు గొప్ప అంత్యకాలపు సంఘటనలను గురించి ప్రతి
క్రైస్తవుడు తెలిసికొని ఉండాలి. మొదటిది, ఎత్తబడుట, పరలోకానికి మనలను భూమిమీద
నుండి కొనిపోవుటకు యేసు తిరిగి వచ్చే సంఘటనను మన లేఖనభాగం వివరిస్తుంది.
ఎత్తబడే ఈ సంఘటన రెండవ అంత్యకాలపు గొప్ప సంఘటనయైన 'గొప్ప శ్రమలను'
ప్రారంభిస్తుంది (మత్తయి 24:21). ఏడేండ్లు నరకయాతన భూమిమీద రాజ్యమేలుతుంది
(ప్రక. 6-19). ఎన్నడు సంభవించని శ్రమల అనంతరం లోకం క్రీస్తు రాకడను చూస్తుంది.
హర్మెగెద్దోను యుద్ధంలో క్రీస్తు విరోధిని ఓడించుటకు యేసు తన పరిశుద్ధులతో తిరిగి
వచ్చును. ఇది అంత్య సంఘటనలో మూడవది. ఆయన రాకడయే (ప్రక. 20:1-6).
ఆయన రాకడ నాల్గవ అంత్యకాల సంఘటనయైన వేయి సంవత్సరాల ప్రపంచ శాంతి
నెలకొల్పబడు క్రీస్తు వేయ్యెండ్ల పరిపాలనను ప్రవేశపెట్టును. ఆ తరువాత ఐదొవ సంఘటన
అంతిమ తీర్పు. సాతాను మరియు అవిశ్వాసులు నరకంలోకి త్రోయబడుతారు (ప్రక.
20:7-15). ఆఖరు, చివరి అంత్యకాలపు సంఘటన, ఆకాశం భూమి అగ్నిచే కాల్చివేయబడి,
నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము ఆవిర్భవిస్తుంది (ప్రక. 21-
22). ఆ పరలోక పట్టణములో, చెప్పశక్యముగాని ఆనందంతో మన రాజైన యేసుతో
నిత్యం దేవుని ప్రజలు నివాసం చేస్తారు.
ఎత్తబడే తరం మనమే కావొచ్చు! రోజులు గడుచుచున్న కొలది అంత్యకాలం
సమీపిస్తూ ఉంది. యెత్తబడుటకు ముందు రానున్న “అపాయకరమైన” కాలములు ఇవే
గావచ్చు (2 తిమోతి 3:1-5). ఏ క్షణంలోనైనా, దేవుని బూర మ్రోగవచ్చును. ఈ ఆరు
అంత్యకాల సంఘటనలు సంభవించవచ్చును. నీవు సిద్ధంగా ఉన్నావా! లేకపోతే, నేడే
సిద్ధపడుటకు పూనుకొనుము.