Monday, October 10, 2022

పనికిరానిది ఉండకూడదు జనవరి 23

కీర్తనలు 101:2,3 - “నా యింట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా

కన్నుల యెదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తిమార్గము తొలగినవారి క్రియలు

నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను."

క్రైస్తవ్యం ఇంటిలోనే ఆరంభం కావలెను. "ఇంటిలో నీవు యేసు కొరకు జీవించకపోతే,

ఇతరులకు అందించుటకు క్రైస్తవాన్ని బయటికి ఎగుమతి చేయకు" అని ఒకతను చక్కగా

చెప్పాడు. నిజంగా, మన కుటుంబ జీవితాలలో ఆరంభించబడి, క్రీస్తు మన పూర్తి జీవితాలను

మార్చాలని కోరుతున్నాడు. క్రీస్తు ఘనపరచబడి, ఆరాధింపబడి, విధేయత చూపే పరిశుద్ధాత్మ

యొక్క నివాసాలుగా మన గృహాలు ఉండాలి. యేసుక్రీస్తు నామాన్ని మన ఇంటిలో ఏదియు

అగౌరపరచకూడదు. మన టి.వి. కంప్యూటర్స్, రేడియోలగుండా వచ్చే ప్రతిది ఆయనకిష్టమో

కాదో చూడాలి. మన ఇంట్లోది ఆయనకు సరిపోదని ఏ మాత్రం సందేహం కలిగిన దానిని

వెంటనే తొలగించాలి. తీవ్ర పరిణామాలను ఆహ్వానించుటకంటే తగు జాగ్రత్త తీసికోవడంలో

కొంత పొరపాటు జరిగినా ఫర్వాలేదు.

తన ఇంటిలో దైవిక జీవితాన్ని జీవించుటకు కీర్తనాకారుడు ఆశించాడు. దేవుని

యెదుట ఆయన కుటుంబ సభ్యుల యెదుట యథార్థవంతముగా నడుచుకోవాలని ఇష్టపడ్డాడు.

తన ఇంటిలో తన కన్నుల యెదుట పనికిమాలినవస్తువేది ఉంచుకోకూడదని నిర్ణయిస్తూ,

ఒక విగ్రహాన్ని సూచిస్తున్నాడు. తన కన్నుల యెదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను అన్ని

చెబుతున్నాడు. అతడు నైతికంగా ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండాలని కోరాడు. కాబట్టి

తన ఇంటిలోవున్న దుష్కార్యం, అసభ్యకరమైనదాని మీద అతడు యుద్ధాన్ని ప్రకటించాడు.

చాలామంది క్రైస్తవుల గృహాలు ఆధ్యాత్మికంగా శుభ్రం చేసికోవలసిన అవసరం

ఉంది. యేసుతో నీ నడకను అడ్డుకునే పనికిరానిదేదైనా నీ గృహంలో ఉందా? టెలివిజన్

కార్యక్రమాల గురించిన సంగతేమిటి? సినిమాలు, మ్యాగజైన్లు, నీవు వినే సంగీతం మరియు

ఇంటర్నెట్లో నీవు చూసేది? పాపంతో నిండినదేదైనా నీ ఇంటిలో ఉంటే, నీ కుటుంబంలో

సంక్షోభాన్ని సృష్టించడానికి సాతానుకు అవకాశమిచ్చినట్లవుతుంది. నీ గృహంలో

ప్రార్ధనపూర్వకంగా నడువుము. దానిలో ప్రతిభాగాన్ని యేసుకు అప్పగించుము. నీ గృహంలో

నీ విశ్వాసం యథార్థమైనదిగా ఉండునట్లు "పనికిరాని ప్రతి దానిని తిరస్కరించుము!