మత్తయి 3:7 - "మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.".
ఆధునిక క్రైస్తవ పదజాలం నుండి మాయమైపోయినప్పటికీ, చిన్నదైనను, శక్తివంతమైన
పదం "పశ్చాత్తాపము." రక్షణ, పరిశుద్ధ జీవనం గురించి బైబిలులో అది కీలకాంశం.
అయినప్పటికీ, కొంతమంది, బోధకులతో సహా, పశ్చాత్తాపం అనే పదాన్ని ఏమాత్రం
పేర్కొనరు. పశ్చాత్తాపపడుట అనగా హృదయంలో, మనస్సులో మార్పును అనుభవించుట,
అంతరంగంలో మార్పును చర్యల ద్వారా బాహ్యంగా ప్రదర్శించుట. నిజమైన రక్షణ
జరగాలంటే పశ్చాత్తాపం, విశ్వాసం ఈ రెండు విడదీయలేని అవసరతలు (మార్కు 1:14,15;
అపొ కా 20:20,21)
యేసు భూలోక పరిచర్య ఆరంభం ముందు, బాప్తిస్మమిచ్చు యోహాను యూదయ
అరణ్యంలో ప్రకటించెను. యూదుల మెన్సీయా అనే యేసు కొరకు అలనాడు మార్గం
సిద్ధపరచుచుండెను. ఆయన ప్రవచన స్వరాన్ని వినుటకు గొప్ప జనసమూహం కదిలి వచ్చింది.
దేవునివైపు వారి పశ్చాత్తాపానికి మరియు రాబోయే క్రీస్తు కొరకు వారి ఎదురు చూపునకు
గుర్తుగా శ్రోతలకు యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చుచుండెను. ఒకనాడు, కొంతమంది యూదా
మతనాయకులు (పరిసయ్యులు, సద్దూకయ్యులు) యోహాను మాటలు వినుటకు వచ్చారు.
'సర్వసంతానమా' అని వారిని సంభోదిస్తూ వెంటనే వారిని గద్దించెను. అప్పుడు పశ్చాత్తాపానికి
సంబంధించిన మాటలను మాట్లాడెను. నిజమైన పశ్చాత్తాపం జీవితంలో మార్పును తెస్తుందని
కచ్చితంగా వారితో యోహాను చెప్పెను. వేషధారణతో కూడిన వారి క్రియలో మార్పురానంత
వరకు, వారి బాప్తిస్మంలో తనకు పాలు లేదని చెప్పాడు. మారుమనస్సుకు తగిన ఫలాన్ని
అతడు
యోహాను మాటలు నీకు కఠినంగా అనిపిస్తే, బహుశా నీవు పశ్చాత్తాపం కొరకు
దేవుని కోరికను నీవు అర్ధం చేసికోలేదు. నేడు అనేకమంది ఎంతో కొంత "క్రీస్తు కొరకు
నిర్ణయాన్ని” చేసుకున్నారు గాని అనేకులు మారుమనస్సు పొందినట్లు కాదు. మారుమనస్సు
పొందుటకు నిరాకరించినవారు నశించెదరు అని యేసు చెప్పెను (లూకా 13:3,5), నీ
పాపాలు తుడిచివేయబడుటకు నీవు పశ్చాత్తాపం చెందాలి (అపొ.కా. 3:19), మారుమనస్సు
ఫలం క్రీస్తులా మారుట. యేసు లేకుంటే మార్పు లేదు. మార్పు లేకపోతే, యేసు లేదు!