Monday, October 10, 2022

ఆకాశంలో ఒక సందేశం జనవరి 21



కీర్తన 19:1 - "ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము

ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది.”

మాపైనున్న ఆకాశాన్ని మధ్యరాత్రి వేళ నేను నా భార్య పడవలో కూర్చోని ఆశ్చర్యంగా

చూశాం. ఉత్తర ఆర్కాన్సాకు చెందిన ఓజార్క్ పర్వత శ్రేణుల మధ్య వున్న కొలను, పైనున్న

కోట్లాది నక్షత్రాలను ప్రతిబింబిస్తుంది. ఆ దివ్య ఆవరణ స్థలం క్రింద మేము చేతులను

పట్టుకొని కూర్చొన్నాం. మామీద ఉన్న ఆకాశం ప్రదర్శిస్తున్న అద్భుతమైన సౌందర్యాన్ని

గ్రహించి ప్రభువును మేము ఆరాధించాం. ఆకాశంలో నిశ్శబ్ద సందేశం అది. ఆ సందేశాన్ని

స్పష్టంగా, గట్టిగా విన్నాం.

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు (కీర్త. 14:1).

వారి మనస్సులో బాగా ఎరిగినవారై హృదయంలో అనుకుంటారు. దేవుడున్నాడని అందరికీ

తెలుసు. సృష్టి సౌందర్యం దాని నిరూపిస్తుంది. ప్రభువు యొక్క “అదృశ్య లక్షణములు, ఆయన

నిత్యశక్తి, దైవత్వం” సృష్టి క్రమం ద్వారా "తేటగా కనబడుచున్నది” (రోమా 1:20). అటువంటి

సృష్టికర్త లేడని గర్వంగా వాదించడం వాస్తవంగా బుద్ధిహీనమైనది (రోమా 1:22). ఠీవిగల

పర్వతాలు “దేవుడున్నాడని" కేకలేయుచున్నవి. ఉరకలేసే సముద్రాలు "సృష్టికర్త" వీటినన్నింటిని

చేశాడని ప్రకటిస్తున్నాయి. అప్పుడే పుట్టిన పాప అమాయక ముఖం ఈ విధంగా గట్టిగా

కేకలేస్తుంది “నేను ప్రకృతిలో ప్రమాదవశాత్తు సంభవించిన సంభవాన్ని కాదు. లేదా

కోట్లాది సంవత్సరాలు ప్రయత్నంగా జరిగిన జీవశాస్త్ర మార్పు ఫలితం కాదు. గాని, పరిశుద్ధ

దేవునిచే ఆశ్చర్యమును భీతియు కలిగించు విధముగా చేయబడిన దానను!" ఎవరూ

వినకపోయినా, సృష్టి ప్రకటిస్తూనే ఉంది.

గలిలయా సముద్రపు నీటిలో సూర్య కిరణాలు పరివర్తనం చెందుచుండగా వారు

మనస్సులలో సరిగా ఎరిగినప్పటికి వారి హృదయాలలో పలికెదరు. రాత్రివేళ కొలోరాడో

శిలాపర్వతాలను ఎక్కి గోలన్ హైట్స్ పర్వతాల మీద సూర్యోదయాన్ని నేను చూశాను.

అర్కాన్సాలో చూసిన నక్షత్రాలనే చూచాను. టెక్సాన్ గంభీరమైన మైదానంతో సూర్యాస్తమయాన్ని

ఆశ్చర్యభరితుడనై తిలకించాను. నేను ఇలాంటి మరెన్నో సందేశాలను ఆకాశంలో చూశాను.

దేవుడు లేడని నాతో చెప్పకుము. “ఆయన ఉన్నాడని” ఆకాశం కేకలేస్తుంది.