Monday, October 10, 2022

మూడు మహిమకరమైన నామములు జనవరి 19

ప్రకటన 1:5 "నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా

లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండియు, మనలను ప్రేమించుచు

తన రక్తముఃవలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు

ప్రభావమును యుగయుగములు కలుగును గాక”

ఒక ఆదివారం అపొస్తలుడైన యోహాను దేవుని ఆరాధిస్తుండగా అకస్మాత్తుగా

దర్శనంలో పునరుత్థానుడును, హెచ్చింపబడిన దేవుని కుమారుడైన యేసును చూశాడు. ఆ

దర్శనం నుండి, ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని గురించి మరింత గ్రహింపునకై

యోహాను యేసును మూడు భిన్నమైన నామములో వర్ణిస్తున్నాడు.

నమ్మకమైన సాక్షి. "సాక్షి" అనే గ్రీకు పదం నుండి “హతసాక్షి” (మార్టిర్) అనే

ఇంగ్లీషు పదం వచ్చింది. యేసు “నమ్మకమైన హతసాక్షి.” యేసు సిలువ వేయబడినదానికి

యోహాను సాక్షి (యోహాను 19:26,27). మానవుని పాపాల కొరకే యేసు మరణించాడని

అతనికి తెలుసు. పాపపు శక్తినుండి "ఆయన రక్తంచే" మనలను విడుదల చేయుటకై క్రీస్తు

మన కొరకు చనిపోయాడు.

మృతులలో ఆదిసంభూతుడు. యేసు పునరుత్థానం విశిష్టమైనది. ఇతరులు

ఆయనకంటే ముందు మరణంనుండి తిరిగి లేపబడ్డారు. కాని వారందరు రెండవసారి

మరణించారు. మరెన్నడు మరణించకుండునట్లు పునరుత్థానులైన వారిలో యేసు

మొదటివాడు. ఆయన తనను గూర్చి ఈ విధంగా చెప్పుకున్నాడు - "మృతుడనైతిని గాని

ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను” (ప్రక. 1:18).

భూపతులకు అధిపతి. యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. భూమి

మీద ఉన్న ఏ అధికారం ఆయనపై ఆధిపత్యాన్ని చూపలేదు. ఆయన సంకల్పాలను ఎవరూ

చెడగొట్టలేరు. రాజుల హృదయాలను నీటి కాలువవలె ఆయనకు ఇష్టం వచ్చినట్లు

మరల్చగలడు (సామె. 21:1). ఆయన చరిత్రకు అంతం పలికి, అంతంలో అందరిచేత

ఆరాధింపబడతాడు (ఫిలి. 2:9-11).

యేసు ఒక మత బోధకునికంటె ఒక వేదాంతికంటే లేదా ఒక సామాజిక నాయకునికంటె

అధికుడు. మన పాపాలకై చనిపోయినవాడు ఆయనే, మరణించి తిరిగి లేచినవాడు ఆయనే.

రాజులకు రాజు ఆయనే, ఆయన మన స్తుతులకు పాత్రుడు. కీర్తనీయుడు మరియు మన

విరిగినలిగిన సాత్వికమైన సంపూర్ణ విధేయతకు పాత్రుడు. నేడే ఈ మూడు మహిమకరమైన

నామాల గుండా ఆయనను వీక్షించుచుండగా, ఆయన ఎదుట వంగి ఆయనను హెచ్చించుము,

ఘనపరచుము.