1 పేతురు 5:8 - "నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన
అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”
అపవాది అపాయకరమైనవాడే గాని దేవుని బిడ్డ ఎవరైనా వాడిని ఓడించవచ్చును.
యేసు సాతానును జయించాడు. అతని మీద మరియు దయ్యపు శక్తులన్నిటిమీద ఆయన
మనకు అధికారాన్ని ఇచ్చాడు. మనము సాతానును ఏవిధంగా జయించగలం?
మన స్థానాన్ని మనం ఎరగాలి. ఆత్మ లోకంమీద యేసు ప్రభువై ఉన్నాడు. తన
శత్రువులన, అపవాదితో సహా, పాదములకు పీఠముగా మార్చుచున్న తండ్రియైన దేవుని
కుడిపార్శ్వమున సార్వభౌముడై ఆయన కూర్చోని వున్నాడు (కీర్త. 110:1). క్రైస్తవులారా,
పరలోకంలో క్రీస్తుతో పాటు మనం కూర్చుని వున్నాం (ఎఫెసీ. 2:4-6). సాతాను క్రీస్తు
పాదాల క్రింద ఉన్నాడు గనుక, వాడు మన పాదాల క్రిందే ఉన్నాడు. క్రీస్తులో దయ్యాలను
వెళ్లగొట్టుటకు (మార్కు 3:14,15), దయ్యపు “సర్పములు మరియు తేళ్ల మీద జయకరంగా
నడుచుటకు మనకు అధికారం కలదు (లూకా 10:19).
మన భద్రతను వాడుకోవాలి. ప్రార్థనపూర్వకంగా అపవాదిని ఓడించుటకు (ఎఫెసీ.
6:10-18). క్రైస్తవులు దేవుని సర్వాంగ కవచాన్ని అనుదినం ధరించాలి. సత్యమనుదట్టి,
పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సను జోడు, నీతియను మైమరుపు, రక్షణ
శిరస్త్రాణము, వివ్వాసమను డాలు, ఆత్మ ఖడ్గము (దేవుని వాక్యము) అనునవి శత్రువును
ఓడించి, దుర్గములను పడద్రోయుటకు శక్తినిచ్చే ఆధ్యాత్మిక ఆయుధాలు (2 కొరింథీ. 10:3-
5)
మనం దేవుని శక్తిమీద ఆధారపడాలి. మనలో నివాసం చేసే పరిశుద్ధాత్మ ద్వారా
(1 యోహాను 4:4) యేసు నామములో (అపొ.కా. 16:18), యేసు రక్తము (ప్రక.
12:10,11) మరియు దేవుని వాక్యము (ఎఫెసీ. 6:17). విశ్వాసులు అపవాది మీద శక్తిని
కలిగివున్నారు. ఈ వనరులను అన్వయించుకొని వాడినట్లయితే మన చుట్టూ వున్న దయ్యపు
శక్తుల పతనం ఆరంభమవడాన్ని చూస్తాం.
అపవాది నిన్ను ఓడించిందా? క్రైస్తవునిగా, అతని దుర్వినియోగాన్ని ఇంకేమాత్రం
సహించాల్సిన అవసరం లేదు. ప్రతిదాడి చేయుము! నీలోనున్న క్రీస్తు అధికారాన్ని విడుదల
చేయుము. నీ స్థానాన్ని, నీ భద్రతను, బలాన్ని యేసు నామంతో అన్వయించుకొనుము. నేడే
ప్రభువు అపవాది మీద నీకు విజయాన్ని దయచేస్తాడు!