Monday, October 10, 2022

తొలిప్రేమ జనవరి 16



"అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను

ప్రకటన 2:4

నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది."

-

క్రైస్తవులంగా మనం చేయునది ఎందుకు చేస్తున్నాం? ఉదాహరణకు, మనమెందుకు

ప్రార్థిస్తాం? కేవలం దేవుని ఆశీర్వదాలను మెండుగా పొందుటకా? మనమెందుకు సేవ

చేస్తున్నాం? మనుష్యులు గమనించాలనా? మనమెందుకిస్తున్నాం? ఆర్థికంగా

ఆశీర్వదింపబడుటకా? ఉద్దేశాలు యుక్తిగలవి. మన హృదయాలు మోసకరమైనవి కనుక

వాటిని గ్రహించటం చాలా కష్టం (యిర్మీయా 17:9). క్రీస్తును సేవించడానికి ఒకే ఒక

సరైన ఉద్దేశం ఆయన యెడల యథార్ధమైన ప్రేమ. యేసును ప్రేమించకుండ యేసు కొరకు

శ్రమ పడడం పాపం.

ఎఫెసీ సంఘం గొప్ప చరిత్ర గల అద్భుతమైన సంఘం. ఉజ్జీవపు అగ్ని జ్వాలాలలో

పౌలు ఈ సంఘాన్ని స్థాపించాడు (అపొ.కా. 19వ అధ్యాయం). తిమోతి మరియు

అపొస్తలుడైన యోహాను ఆ సంఘంలో సీనియర్ పాస్టర్లుగా పనిచేశారు. ఆ ప్రాంతంలోవున్న

ఇతర సంఘాలకు ఇది తల్లి సంఘము. యేసు తానే ఈ సంఘాన్ని అనేక విధాలుగా

ప్రశంసించాడు. ఎంతో క్రియాశీలక సంఘం, అనేక కార్యక్రమాలను చేసేది. ఆ సంఘ

సభ్యులు అలసిపోయేంతగా క్రీస్తు కొరకు శ్రమించి సేవ చేశారు. హింసలతో సంరక్షింపబడి,

సిద్ధాంతరీత్యా పవిత్రమైనది. ఆ సంఘం అబద్ధ అపొస్తలులకు వారి అబద్ధాన్ని బయటపెట్టింది.

అయినా, ఆ సహవాసంలో ఒక భయంకరమైన లోపాన్ని యేసు చూశాడు. ఆయన కొరకైన

తమ తొలి ప్రేమను వారు విడిచిపెట్టారు. యేసు కొరకు వారికున్న ఆ ఉత్సాహం, ఆసక్తి

చల్లారి, యాంత్రికంగా ఆచారబద్ధంగా మారి పేరుకు మాత్రం కొనసాగుతుంది. ఉజ్జీవపు

జ్వాల అంతా ఆరిపోయింది. మధుర క్షణాలు వీగిపోయాయి, వరుడు కలవరం చెందాడు.

నీ గురించి లేక నీ సంఘం గురించి ఇది వాస్తవమా? ఇంతకు ముందుకంటే

ఎక్కువగా యేసును నీవు ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో,

బలముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమిస్తున్నావా? (మార్కు 12:30). ఈ క్షణంలో నీ

హృదయంలో యేసు కొరకు యథార్థమైన ఆసక్తి ఉందా? లేకపోతే ఎందుకు? నీ జీవితంలో

ఆయనకు చెందిన స్థానాన్ని మరేది ఆక్రమించుకుంది? అది ఏదైనా, అది తగదని

గ్రహించుము. ఆ స్థానాన్ని నేడే యేసుకు తిరిగి ఇమ్ము. పశ్చాత్తాపపడి, ఎన్నటికి ఆయనే నీ

"తొలిప్రేమ"గా ఉండుమని అడుగుము.