"మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను
M. 2008
మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను.”
పరిపూర్ణ
దేవుడు పరిశుద్ధుడు మరియు పవిత్రుడు. ఆయన సంపూర్ణమైన వెలుగు. యుగాలు
గడుస్తుండగా, "పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!" అని కేక వేయడం ఎన్నటికి
ఆపకుండా దూతగణం అనుదినం ఆయన సింహాసనం చుట్టు చేరివున్నారు.
పరిశుద్ధత సారాంశమైన ఈ దేవుడు పరిశుద్ధపరచి, ఈ లోకంలోనుండి ప్రజలను పిలిచి
తనకు ప్రత్యేక జనాంగాను, పరిశుద్ధ సొత్తుగాను చేసుకున్నాడు. మన పాఠ్యభాగంలో,
మిమ్మును పరిశుద్ధపరచి ఇతర జాతులలో నుండి వేరుచేసి నా కొరకు ఒక ప్రత్యేక
జనాంగముగా, నా సొత్తుగా చేసుకున్నాను అని దేవుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు.
వారు ఆయనకు చెందినవారు, ఆయన పరిశుద్ధతలో వారు ఆయనను ఆనుసరించాలి.
ఆయనను ఆరాధించుటకు, సేవించుటకు, ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుటకు మరియు ఆయన
శీలాన్ని అనుసరించుటకై లోకంనందు వారు ప్రతిష్ఠింపబడ్డారు. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ
జనాంగంగా ఉన్నంతవరకు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే వారు వారి చుట్టూ
వున్న అన్యలోకాన్ని అనుసరించి, అక్కున చేర్చుకొనుటకు ప్రయత్నించారో, వారిని ఆయన
శిక్షించాడు. వారు పరిశుద్ధులైయుండాలని ఆయన సెలవిచ్చాడు మరియు దానిని భిన్నమైన
జవాబును పొందుటకు ఆయన తిరస్కరించాడు.
నేడు క్రైస్తవులంగా మనం వేరుపరచబడి దేవునిచే పరిశుద్ధపరచబడ్డాము. అంధకార
జీవితంనుండి, పాపం నుండి పరిశుద్ధమైన వెలుగు జీవితానికి, విధేయతకు పిలిచాడు.
మనం ఈ లోకాన్ని లేదా దానిలో వున్నవాటిని ప్రేమించకూడదు (1 యోహాను 2:15).
మనం దేవుని పరిశుద్ధపరచబడిన ఆధ్యాత్మిక వంశంగా, ఆయన రాజులైన యాజక
సమూహముగాను, పరిశుద్ధ జనముగాను ఉండాలి (1 పేతురు 2:9,10). మనము ఈ
లోకంలో ఉన్నవారికంటే భిన్నంగా నడుచుకోవాలి, మాట్లాడాలి, ఆలోచించాలి మరియు
ప్రవర్తించాలి. దేవుడు ఇంకా యెహోవా మెకదేష్ : “పరిశుద్ధపరచు యెహోవాయే.” ఆయన
పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండుటకు మనలను శుద్ధీకరించాడు.
క్రీస్తు నిన్ను రక్షించినట్లయితే, ఆయన ఎన్నుకున్న పాత్రలలో ఒకటిగా ఉండుటకే
ఆయన నిన్ను వేరుపరచాడు. అపవిత్రమైన లోకంలో నీవు జీవిస్తుండగా ఆయన నామానికి
అవమానం జరుగకుండా జీవించాలి. నేడు ఆయన నిన్ను శక్తితోను, పవిత్రతతోను నింపుమని
ప్రభువును అడుగుము. ఆనందంతో విభిన్నంగా మరియు ఆహ్లాదకర విశిష్టంగా ఆయన
నిన్ను రూపుదిద్దనిమ్ము! ఆయన తన సంతోషం నిమిత్తం నిన్ను పరిశుద్ధపరచే ప్రభువు.