Monday, October 10, 2022

క్రొత్త తైలము జనవరి 14



కీర్తనలు 9:10 "గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ముపైకెత్తితివి. క్రొత్త

తైలముతో నేను అంటబడితిని.”

1

గడ్డి కోసే ఇంజనులోని ఇంధనపు స్థాయిని పరీక్షించి చూసిన నా తండ్రి పెదవి

విరిచాడు, నా కుమారుడా, ఈ ఇంధనం పాడైపోయినట్లుంది. దీన్ని మార్చి ఎన్నాళ్ళైంది?

“నాకు తెలియదు నాన్న, పోయిన సంవత్సరం కాబోలు అన్నాను.” “పోయిన సంవత్సరమా?”

"బాబు, ఇంజన్ కాలిపోయేలా చేశావు?" అన్నాడు మా నాన్నగారు. ఇక చెప్పేదేముంది,

అప్పటికప్పుడే ఇంధనాన్ని మార్చేశాను. గడ్డిని కోస్తూ బాగా సంపాదించాను, గాని తాజా

ఆయిల్ అవసరతను అర్థం చేసికోలేకపోయిన కారణాన్నిబట్టి నేను నా యంత్రాన్ని కోల్పోవలసి

వచ్చింది.

పద్దెనిమిదొవ యేట నేను క్రైస్తవుడయ్యాను. అనంతమైన ఆసక్తి, జిజ్ఞాస మరియు

అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తితో నేను ఆరంభించాను. కాని కొన్ని మాసాల అనంతరం, నా

ఆసక్తితో కొంతభాగాన్ని పోగొట్టుకోవడం ఆరంభించాను. మరికొంతమంది కాలేజీ విద్యార్ధులతో

బైబిలు అధ్యయనం గ్రూపులో ఆ తరువాత చేరాను. అనుదిన బైబిలు అధ్యయనం మరియు

ప్రార్థన ప్రాముఖ్యతను వారు నాతో పంచుకున్నారు. శారీరకంగా మనం ఏవిధంగా

పోషించుకుంటామో ఆ విధంగా అనుదినం ఆధ్యాత్మికంగా ప్రతి క్రైస్తవుడు పోషింపబడాలి.

అని వారు నాతో చెప్పారు. పరిశుద్ధాత్మతో ఏవిధంగా క్రమంగా నింపబడుతూ ఉండాలో

కూడా వారు నాతో చెప్పారు (లూకా 11:13; ఎఫెసీ. 5:18). నేను అనుదినము ఆధ్యాత్మిక

మన్నాను (దేవుని వాక్యం) భుజించుట మరియు అనుదినం ఆధ్యాత్మిక నూనెతో (పరిశుద్ధాత్మ)

అభిషేకించబడుతూ ఉండుట యొక్క విలువను నేర్చుకున్నాను. ఆ విధంగా అనుదినం

పోషింపబడుతూ, నింపబడుతూ ఉండగా, నేను బలం పొంది, క్రమంగా ఎదగడం

ఆరంభించాను.

అనేకమంది క్రైస్తవులు ఆధ్యాత్మికంగా “సత్తువ కోల్పోయారు.” వారు తమ రక్షణను

కోల్పోలేదు గాని రక్షణానందాన్ని కోల్పోయారు. “గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్మును

పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని” అని దావీదు చెప్పెను. కాబట్టి మనకు

కూడా అలాంటిది అవసరమై ఉన్నది.

నీ ఆధ్యాత్మికత తైలము పాతగిలి చాలిచాలనంతగా వుందా? అలాగైతే, క్రొత్త తైలమును

నీకిమ్మని దేవుని అడుగుము. ఆయన ఆత్మ నిన్ను నింపి నీకు శక్తినిస్తుంది. నీ ఆధ్యాత్మికత

ఇంజనన్ను “కాలిపోనివ్వద్దు” దానికి బదులు, యేసుతో అనుదినం నడుస్తూ దానిని పనిచేసేలా

ఉంచుకొనుము. ఆయన తైలము తాజాది, ఆయన సరఫరా అపరిమితం.