"దేవుని కుమారుని నామమందు వివ్వాసముంచు మీరు
1
1 యోహాను 5:13
నిత్యజీవము గలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను.”
జీవితంలో వడిదుడుకులుంటాయి. నేడు, ప్రజలు నూతన యుగపు మానసిక
తాంత్రికులను సంప్రదించి వారి భవిష్యత్తును ఊహించుకునే ప్రయత్నంలో అనేక మోసకరమైన
మార్గాలను వెదకుతున్నారు. రేపు ఏమి తీసికొని వస్తుందో ఏ వ్యక్తి ఎరుగనప్పటికీ, మనం
పరలోకం వెళ్లే మార్గంలో ఉన్నామనే సత్యాన్ని కచ్చితముగా మనం తెలుసుకోగలం.
"1
రక్షణ కర్త. రక్షణకు ఒకే ఒక మూలం యేసు. “దేవుని కుమారుడు.” ఆయ
పేరుకు అర్థం “యెహోవాయే రక్షణ.” ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెను
(లూకా 19:10). సర్వలోకానికి ఆయనే రక్షణయొక్క నిరీక్షణ (అపొ.కా. 4:12). దేవుని
ఎరుగుటకు మరియు పరలోకం ప్రవేశించుటకు యేసు ఏకైక మార్గం (యోహాను 14:6).
సమస్త మానవాళికి, దేవునికి ఆయనే ఏకైక మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఆయన మాత్రమే
రక్షించగలడు.
రక్షణ అంగీకారం. ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి “ఆయన నామంలో
విశ్వాసముంచాలి." విశ్వాసం మానసిక అవగాహనకంటే మిన్నయైనది. యేసు జననం,
మరణం, పునరుత్థానాల వాస్తవాలను దెయ్యాలు కూడా నమ్ముతాయి (యాకోబు 2:19).
అయినా వారు నరకానికెళ్తాయి. తన పాపాలకోసం యేసు చనిపోయాడని, మరణం నుండి
లేచాడని, ఆ వ్యక్తి నమ్మాలి. ఆ తరువాత ప్రభువుగాను, రక్షకునిగాను స్వీకరించాలి (యోహాను
1:12). ఆ క్షణమందే నిత్యజీవం ఆరంభమవుతుంది.
రక్షణ నిశ్చయత. యేసును స్వీకరించిన తరువాత, ఒక వ్యక్తి, రక్షణ నిశ్చయతను
కలిగి ఉండవచ్చును. దేవుని చేతిలోనుండి మరేది అతన్ని అపహరించలేదు (యోహాను
10:27-29). దేవుని ప్రేమనుండి మరేది అతన్ని వేరుచేయలేదు (రోమా 8:38,39).
దేవుని ఆత్మ ముద్రను మరేది తొలగించలేదు (ఎఫెసీ. 1:13,14). మనలను రక్షించే
దేవుడు, మనలను కాపాడి, మన రక్షణను భద్రపరుస్తాడు!
భవిష్యత్తును ఏ ఒక్కరు ఎరుగకపోయినా మనం చనిపోయినప్పుడు పరలోకం వెళ్లి
నిత్యం యేసుతో జీవిస్తామని మనం తెలుసుకోగలం. అలాంటి ధన్యకరమైన నిశ్చయత
నీకుందా? అలాగైతే, ఇతరులతో పంచుకొనుము. లేకపోతే, నిన్ను రక్షించుటకు, నిన్ను
భద్రపరచుటకు నేడే నీ హృదయంలోనికి రమ్మని ప్రభువును అడుగుము.