అపొ.కా. 27:25
"కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నీతో మాట
చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.”
1
నేను వందకు మించిన పాస్టర్లతో కూర్చున్నప్పుడు, వ్యక్తిగతంగా వారిలో ఏ ఒక్కరిని
ఎరుగనని నేను గ్రహించాను. చాలామందిమి ఒంటరిగా, మౌనంగా కూర్చున్నాం.
కొంతమందితో మాట్లాడి, కొంతమందిని నేను గమనిస్తుండగా, వారిలో చాలామంది
ఒంటరితనంతో, నిరుత్సాహంతో ఉన్నారని నేను గ్రహించాను. వాస్తవానికి, దేవుని ప్రజలను
నిరుత్సాహపరచుటకే సాతానుడు ఇష్టపడతాడు. మనకు వ్యతిరేకంగా వాడు వాడే అత్యంత
వినాశకరమైన ఆయుధాలలో అది ఒకటి. మనం విశ్వాసంతో నడవాలని మరియు ధైర్యము
తెచ్చుకోవాలని యేసు కోరుతున్నాడు.
కైసరు ఎదుట విచారణ ఎదుర్కొనుటకు అపొస్తలుడైన పౌలు బంధీగా రోమా
పట్టణానికి బయలుదేరాడు. ఆయన మధ్యధరా సముద్రాన్ని దాటగానే, తాను ప్రయాణిస్తున్న
ఓడ భయంకరమైన తుఫానులో అనేక రోజులు ఇరుక్కొనిపోయింది. తుఫాను ఏమాత్రం
నిమ్మళించకపోవుట వలన అందులో ఉన్నవారంత ప్రాణాలమీద ఆశ వదులుకున్నారు.
అకస్మాత్తుగా రాత్రివేళ ఒక దూత పౌలుకు కనబడి, యేసు కొరకు సాక్ష్యమిచ్చుటకై రోమా
క్షేమంగా చేరుకుంటావు అని వాగ్దానం చేశాడు. ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరు పౌలుతో
సహా సురక్షితంగా బయటపడతారు అని కూడా వాగ్దానం చేశాడు. పౌలు ఈ వార్తను
కృంగిపోయినవారికి, మన లేఖన భాగపు మాటలను వక్కాణిస్తూ చెప్పాడు. ప్రభువు సెలవిచ్చినట్టే
సమస్తం జరిగింది. దేవుడు పౌలును ప్రోత్సహించాడు, పౌలు ఇతరులను ప్రోత్సహించాడు.
దేవుడు తగిన సమయంలో కల్పించుకోవడం వలన అనేకుల ప్రాణాలు కాపాడబడ్డాయి, అనేక
ఆత్మలు రక్షింపబడ్డాయి.
ఈ రోజు నీవు నిరుత్సాహంగా వున్నావా? ఆశాజనకమైన రేపటి కొరకు నీ ఆశను
వదులుకునెలా నీ జీవితంలో తుఫానులు చెలరేగాయా? అలాగైతే తుఫానుల వంక చూడడం.
ఆపి, దానినుండి కాపాడే వానివంక, యేసు వైపు చూడుము! వెలి చూపుతో గాక విశ్వాసంతో
నడుచుటకు ఆయన నీకు సహాయం చేస్తాడు. సాతాను నిన్ను భయపెట్టి, నిరుత్సాహపరుస్తాడు
అక్షరాల (“నీ ధైర్యాన్ని దోచుకుంటాడు"). అయితే నీవు దేవునికి అప్పగించుకొని సాతానును
ఎదురించగలవు! యేసుమీద, ఆయన ప్రశస్తమైన వాక్యపు వాగ్దానాలమీద దృష్టిని నిలుపుము.
నీ కొరకు ఆయన సహాయం చేయగలడు. చేస్తాడు. క్రైస్తవుడా, భయపడకుము. ధైర్యము
తెచ్చుకొనుము.